Tamilandu BJP Chief : తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
TVK Vijay: త్రిషతో సంబంధం తెంచుకోవాలని విజయ్‌కు తమిళనాడు బీజేపీ చీఫ్ సలహా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

Tamil Nadu BJP president controversial comments on Trisha: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ టీవీకే అధినేత విజయ్‌ను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విజయ్ అధికారంలోకి వస్తానని చేసిన ప్రకటనపై స్పందిస్తూ, విజయ్ ముందుగా త్రిష నుండి బయటకు రావాలి అని నయనార్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి, తోటి రాజకీ య నాయకుడి వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
CRASS comments by #BJP Tamilnadu Chief Nainar Nagendran on @TVKPartyHQ Chief Vijay.
— Apoorva Jayachandran (@Jay_Apoorva18) February 13, 2026
Attacks #Vijay insinuating cheap comments on @TVKVijayHQ and his Co-Star Actor Trisha. pic.twitter.com/xffAOsQjxM
నయనార్ నాగేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు , టీవీకే పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ క్రేజ్‌ను చూసి భయపడే బీజేపీ ఇలాంటి దిగజారుడు విమర్శలకు పాల్పడుతోందని వారు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు చేయాలి కానీ, ఇలాంటి అసభ్యకరమైన వ్యక్తిగత దూషణలు చేయడం తగదని వారు హెచ్చరిస్తున్నారు.
இந்த நயினார் நாயின் மீது த்ரிஷா @trishtrashers மானநஷ்ட வழக்கு தொடுக்க வேண்டும்.@NainarBJP உன் வீட்டு பெண்களை இப்படி யாரேனும் பேசினால் சும்மா இருப்பியா?
— Surendar (@ScorpionSu58042) February 13, 2026
அரசியல் ரீதியாக விமர்சனம் செய்ய துப்பில்லாத நீயெல்லாம் ஒரு கட்சி தலைவன்.@annamalai_k @khushsundar This is how your party treat… pic.twitter.com/fpMLfDqAMG
ఈ వివాదంలో నటి త్రిష పేరును లాగడంపై మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఏ సంబంధం లేని ఒక మహిళా నటిని రాజకీయ గొడవల్లోకి లాగి ఆమె గౌరవానికి భంగం కలిగించడం నయనార్ నాగేంద్రన్ అహంకారానికి నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు. తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు కూడా బీజేపీ నేత తీరును తప్పుబడుతున్నాయి. రాజకీయాల్లో హుందాతనం లోపిస్తోందని, ప్రజల సమస్యలపై చర్చించాల్సింది పోయి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఫోకస్ పెట్టడం సిగ్గుచేటని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
On State BJP chief Nainar Nagenthran's reported statement on TVK chief Vijay and actor Trisha, DMK MP Dr Kanimozhi NVN Somu tweets, "Criticizing the personal life of someone involved in politics in the public sphere is uncivilized. Moreover, speaking in a way that degrades the… pic.twitter.com/rD4dPtJNRa
— ANI (@ANI) February 14, 2026
విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకోవడానికి ఇలాంటి వ్యూహాలు పన్నుతున్నారని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. సినిమా ఫీల్డ్ లో రకరకాలుగా వినిపించే రూమర్స్ ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి సంబంధం లేని వారిని బలి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.























