సనాతన ధర్మం వివాదంలో కొడుకుని సమర్థించిన స్టాలిన్, ఆ మాట అనలేదని క్లారిటీ - ప్రధానికి లేఖ
MK Stalin: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు.
![సనాతన ధర్మం వివాదంలో కొడుకుని సమర్థించిన స్టాలిన్, ఆ మాట అనలేదని క్లారిటీ - ప్రధానికి లేఖ TN CM Stalin Backs Son Udhayanidhi On 'Sanatan Dharma' Row know details సనాతన ధర్మం వివాదంలో కొడుకుని సమర్థించిన స్టాలిన్, ఆ మాట అనలేదని క్లారిటీ - ప్రధానికి లేఖ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/07/a3b422a1b30bb62e35120d7e9cc127211694072172047517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sanatan Dharma Row:
ప్రధానికి లేఖ..
సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల విషయంలో తన కొడుకునే సమర్థించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్. ఉదయనిధి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, వాటిని తప్పుదోవ పట్టించారని తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రధాని సహా మంత్రులందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడిన సమయంలో "నరమేధం" అనే పదమే అనలేదని వివరించారు. ఇంగ్లీష్‌లో కానీ, తమిళ్‌లో కానీ ఆ పదాన్ని పలకలేదని అన్నారు. ఉదయనిధిపై కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.
"కొందరు బీజేపీ మద్దతుదారులు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని వేరే విధంగా అర్థం చేసుకున్నారు. కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నరమేధం సృష్టించాలని చూస్తున్నారంటూ విద్వేషాలు పెంచుతున్నారు. బీజేపీ చేతుల్లోని సోషల్ మీడియా ఈ ప్రచారం చేస్తోంది. కానీ...ఉదయనిధి తన స్పీచ్‌లో ఎక్కడా నరమేధం అనే పదమే వాడలేదు. అయినా...అదే పదేపదే ప్రచారం చేస్తున్నారు"
- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి
On Tamil Nadu Minister Udhayanidhi Stalin's 'Sanatana Dharma should be eradicated', Tamil Nadu CM MK Stalin says "He expressed his views on Sanatan principles that discriminate against Scheduled Castes, Tribals, and Women, with no intention to offend any religion or religious… pic.twitter.com/pq2GP0esRp
— ANI (@ANI) September 7, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)