అన్వేషించండి

CAA: సీఏఏ అమలు - కేంద్రంపై తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తీవ్ర అసహనం, ఫస్ట్ రియాక్షనే పీక్స్

Citizenship Amendment Act: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఏఏ అమలుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదని.. తమిళ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ అన్నారు.

Opposition Leaders Unacceptable CAA Implementation: కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (CAA)ను నోటిఫై చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ ల నుంచి భారత్ కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఈ చట్టం అమలుపై బీజేపీ ప్రభుత్వంపై విపక్ష నేతలు ఎదురుదాడికి దిగారు. కొందరు ఈ చట్టం అమలుకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా, ఈ చట్టం అమలుపై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ తాజాగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్ కేంద్ర నిర్ణయంపై మండిపడ్డారు. కొందరి పట్ల వివక్ష చూపేలా ఉంటే దీన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. కాగా, 2014 డిసెంబర్ 31 కన్నా ముందు హింసకు గురై భారత్‌కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించనున్నారు.

'ఆమోదయోగ్యం కాదు'

భారత పౌరసత్వ సవరణ చట్టం (CAA) - 2019 ఆమోద యోగ్యం కాదని తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం అధినేత దళపతి విజయ్ అన్నారు. 'దేశంలోని పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 (CAA) వంటి చట్టాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రంలో దీన్ని అమలు చేయకూడదని కోరుతున్నా. ఈ అంశంపై ప్రభుత్వ నేతలు ప్రజలకు హామీ ఇవ్వాలి.' అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళనాడులో చట్టాన్ని అమలు చేయకుండా చూడాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

'ఎన్నికల ముందు అశాంతిని కోరుకోవడం లేదు'

పౌరసత్వ సవరణ చట్టాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర నిర్ణయంపై మండిపడ్డారు. ప్రజలపై వివక్ష చూపే విధంగా ఉంటే తాను అడ్డుకుంటానని అన్నారు. బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో సున్నిత అంశమని, ఎన్నికల ముందు తాను అశాంతిని కోరుకోవడం లేదని వెల్లడించారు. నిబంధనలు పరిశీలించిన అనంతరమే ఈ అంశంపై పూర్తిగా మాట్లాడుతానని పేర్కొన్నారు.

'చట్టం అమలు చేయం'

పౌరసత్వ సవరణ చట్టం మతాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టం ముస్లింలను రెండో స్థాయి పౌరులుగా మారుస్తాయని.. దీన్ని రాష్ట్రంలో అమలు కాకుండా చూస్తామని స్పష్టం చేశారు. మతాల మధ్య విభజనకు వ్యతిరేకంగా కేరళ నిలబడుతుందని చెప్పారు.

కాగా, సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లపై కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాని దృష్టి మరల్చేందుకే సీఏఏ ప్రకటన చేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. 'సీఏఏ చట్టం ఆమోదం పొందిన తర్వాత నిబంధనల రూపకల్పనకే మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల 3 నెలల సమయం తీసుకుంది. సరిగ్గా ఎన్నికల ముందు ఓట్లను చీల్చేలా ప్రణాళిక రచించి ఇప్పుడు తీసుకువచ్చింది. ముఖ్యంగా బెంగాల్, అసోంలో ఓట్లను చీల్చేలా ఈ సమయాన్ని ఎంపిక చేసింది.' అని పేర్కొన్నారు. 

సీఏఏ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్ పెట్టారని, ఎన్నికల ముందే ఎందుకు అమలు చేస్తున్నారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని కోరారు. ముస్లింలే లక్ష్యంగా సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ఫీఆర్ తెచ్చారని ఆరోపించారు. సీఏఏపై తమ అభ్యంతరాలు అలాగే ఉన్నాయని వెల్లడించారు.

Also Read: CAA Rules: అసలేంటీ పౌరసత్వ సవరణ చట్టం? కేంద్రం గెజిట్‌లో ఏముంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget