CM Stalin Hospitalized: ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్- రెండు రోజుల క్రితం కరోనా!
CM Stalin Hospitalized: కరోనా కారణంగా అస్వస్థతకు గురికావడంతో తమిళనాడు సీఎం స్టాలిన్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.
CM Stalin Hospitalized: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎమ్‌కే స్టాలిన్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల కరోనా బారిన పడిన స్టాలిన్‌ను ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే కొవిడ్ రిలేటెడ్ లక్షణాల కారణాలపై ఆయనకు టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Tamil Nadu Chief Minister MK Stalin admitted to a private hospital in Chennai for "investigation and observation for COVID19-related symptoms." pic.twitter.com/x8K3kThmXM
— ANI (@ANI) July 14, 2022
నిలకడగా
చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్టాలిన్ కరోనా బారినపడినట్లు మంగళవారం వెల్లడించారు.
இன்று உடற்சோர்வு சற்று இருந்தது. பரிசோதித்ததில் #COVID19 உறுதிசெய்யப்பட்டதையடுத்து தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன்.
— M.K.Stalin (@mkstalin) July 12, 2022
அனைவரும் முகக்கவசம் அணிவதோடு, தடுப்பூசிகளைச் செலுத்திக் கொண்டு, பாதுகாப்பாய் இருப்போம்.
స్టాలిన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సహా అన్నాడీఎంకే నేతలు ఆకాంక్షించారు.
రాష్ట్రపతి ఎన్నిక్లలో
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది డీఎంకే. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇటీవల చెన్నైకి వచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను కలిశారు. డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా వారిని కోరారు. ఈ సమావేశానికి డీఎంకే మిత్రపక్ష పార్టీల అగ్ర నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Also Read: LS RS Unparliamentary Words: పార్లమెంటులో ఇక ఆ పదాలపై నిషేధం- లిస్ట్ పెద్దదే!