అన్వేషించండి

Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!

Skyroot Vikram-1 launch:స్పేస్‌ క్యాబ్ సేవలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ అంతరిక్ష కేంద్ర సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విక్రమ్‌-1 పేరుతో నేడు ప్రయోగించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శ్రీహరి కోట నుంచి స్కైరూట్ విక్రమ్-1 ప్రైవేట్ రాకెట్ విజయవంతంగా ప్రయోగం.
  • ఇది స్వదేశీ అధునాతన త్రీడీ ప్రింటెడ్ ఇంజిన్ల, కార్బన్ కంపోజిట్ రాకెట్.
  • చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చే 'అంతరిక్ష ఉబర్' సేవలు అందిస్తుంది.
  • 'ఆగమన్' మిషన్ ప్రైవేట్ రంగ ప్రవేశం, ప్రధాని సందేశం మోసింది.

Skyroot Vikram-1 launch: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోటలో ఉన్న సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి శనివారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్‌-1 రాకెట్‌ను ప్రయోగించారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్‌ గౌరవార్థం ఈ రాకెట్‌కు విక్రమ్‌ అని పేరు పెట్టారు.

విక్రమ్‌-1 ప్రత్యేకత ఏంటి?

విక్రమ్‌-1 అనేది పూర్తిగా ప్రైవేటు రంగంలో రూపొందించిందీ రాకెట్‌. ఇది ఒక ఆర్బిటల్ తరగతి రాకెట్‌. దీని నిర్మాణం, సాంకేతికతలో అత్యాధునిక పద్ధతులు ఉపయోగించారు. ఇందులో స్వదేశీ టెక్నాలజీతోపాటు త్రీడీ ప్రింటెడ్‌ లిక్విడ్‌ ఇంజిన్లు, హై- థ్రస్ట్‌ సాలిడ్‌ రాకెట్లను వాడారు. ఇది మొత్తం ఏడు అంతస్తులు ఉంటుంది. బరువు తగ్గించడానికి పూర్తిగా కార్బన్ కంపోజిట్ స్ట్రక్చర్‌తో రూపొందించారు. ఇది సుమారు 350 నుంచి 450 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను భూమికి దగ్గరలో ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లింది.   

అంతరిక్షంలో ఉబర్ లాంటి సేవలు 

విక్రమ్‌-1ను అంతరిక్ష నిపుణులు అల్టిమేట్‌ క్యాబ్‌ టు ఆర్బిట్ అని పిలుస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించాలి అంటే పెద్ద  రాకెట్ల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. అంటే మనం ట్రైన్, బస్‌ల కోసం ఎదురు చూస్తున్నట్టు. కానీ స్కైరూట్‌ అందిస్తున్న సేవలు మాత్రం ఉబర్ లాంటివి అన్నమాట. అంటే శాటిలైట్ ఆపరేటర్లు తమకు కావాల్సినప్పుడు కక్షలోకి ఉపగ్రహాలను పంపుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. అందుకే దీన్నిప్రోత్సహిస్తున్నారు. 

మిషన్ ఆగమన్ లక్ష్యాలు 

ఈ ప్రయోగానికి ఆగమన్‌ అని పేరు పెట్టారు. అంటే స్పేస్‌లో ప్రైవేటు కంపెనీల రాకను చెప్పేందుకు ఈ పేరు పెట్టారు. రాకెట్‌ ప్రొపల్షన్ స్టేజ్‌ సెపరేషన్, నావిగేషన్, ఏవియానిక్స్‌ వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో డేటాను సేకరిస్తారు. చిన్న ఉపగ్రహాల ప్రయోగ మార్కెట్‌లో భారత్ సత్తా చాటేందుకు ఈ మిషన్ చేపట్టారు. అంతే కాకుండా ఇస్రోపై ఉన్న భారాన్ని కూడా తగ్గించే పనిలో ప్రభుత్వం ఉంది. 

నింగిలోకి మోదీ సందేశం 

ఈ రాకెట్‌ ద్వారా ప్రధానమంత్రి మోదీ రాసిన వందేమాతరం అనే సందేశాన్ని కూడా పంపించారు. పోస్టుకార్డులో ఆయన ఈ మెసేజ్‌ను రాశారు. దీంతోపాటు మాజీ ఇస్రో ఛైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, స్కైరూట్‌ ఇంజనీర్ల సంతకాలు, సందేశాలను కూడా ఈ రాకెట్‌ ద్వారా తీసుకెళ్లారు.     

స్కైరూట్ ఎవరు? ఎందుకు ఏర్పాటు చేశారు?

స్కైరూట్‌ ఏరోస్పేస్‌ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగభత్ డాకా ఇద్దరూ ఒకప్పుడు ఇస్రోలో పని చేశారు. భారత్‌లో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం పెంచాలనే ఆలోచనతో వీరు తమ ఉద్యోగాలను వదిలేసి స్కైరూట్ ఏరోస్పేస్‌ అనే స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. వీళ్లు నాలుగేళ్ల క్రితం 2022లో విక్రమ్‌-ఎస్‌ అనే సబ్‌ ఆర్బిట్ రాకెట‌ను విజయవంతంగా ప్రయోగించారు. 

ఇప్పుడు ఈ ప్రయోగంతో చిన్న ఉపగ్రహాల ప్రయోగ మార్కెట్‌లో భారత్ శక్తివంతమైన దేశంగా మారే ఛాన్స్ ఉంది.  ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో కొత్త పుంతల తొక్కేందుకు మిషన్ ఆగమన్ సరికొత్త ట్రెండ్ సెట్ చేయనుంది. ఉదయం నుంచి పడుతున్న టెన్షన్‌కు చెక్ పడింది.  ముందుగా అనుకున్న సమయానికి ప్రయోం చేయలేకపోయినా తలెత్తిన టెక్నకల్ సమస్యను పరిష్కరించి 12. 05కి మళ్లీ నింగిలోకి రాకెట్ పంపించారు.

Frequently Asked Questions

విక్రమ్-1 రాకెట్‌ను ఎక్కడ నుండి ప్రయోగించారు?

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోటలో ఉన్న సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి శనివారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్‌-1 రాకెట్‌ను ప్రయోగించారు.

విక్రమ్-1 రాకెట్‌ ప్రత్యేకత ఏమిటి?

విక్రమ్‌-1 పూర్తిగా ప్రైవేటు రంగంలో రూపొందించబడిన ఆర్బిటల్ తరగతి రాకెట్. ఇందులో స్వదేశీ టెక్నాలజీ, త్రీడీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్లు వాడారు. ఇది 350-450 కిలోల ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్తుంది.

మిషన్ ఆగమన్ లక్ష్యాలు ఏమిటి?

అంతరిక్షంలో ప్రైవేటు కంపెనీల రాకను గుర్తించడం, రాకెట్ వ్యవస్థల డేటాను సేకరించడం దీని లక్ష్యం. చిన్న ఉపగ్రహాల ప్రయోగ మార్కెట్‌లో భారత్ సత్తా చాటడం కూడా దీని ఉద్దేశం.

స్కైరూట్ ఏరోస్పేస్‌ను ఎవరు స్థాపించారు?

ఇస్రో మాజీ ఉద్యోగులైన పవన్ కుమార్ చందన, నాగభత్ డాకా ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. భారత్‌లో ప్రైవేటు సంస్థలకు అంతరిక్ష రంగంలో భాగస్వామ్యం పెంచడానికి దీనిని స్థాపించారు.

విక్రమ్-1 రాకెట్ ద్వారా నింగిలోకి ఏమి పంపారు?

ప్రధానమంత్రి మోదీ రాసిన 'వందేమాతరం' సందేశాన్ని పోస్టుకార్డులో పంపారు. మాజీ ఇస్రో ఛైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, స్కైరూట్ ఇంజనీర్ల సంతకాలు, సందేశాలను కూడా పంపించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget