Operation Akhal: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం- కుల్గామ్ ఎన్‌కౌంటర్‌లో టెర్రరిస్టు హతం
Operation Akhal: ఉగ్రవాదంపై భారత్ సైన్యం ఉక్కపాదం మోపుతోంది. జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ అఖల్ రాత్రి నుంచి కొనసాగుతోంది.

Operation Akhal: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలను భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ వివరాలు అందించింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
"రాత్రి నుంచి ఉగ్రవాదులు, సైన్యం మధ్య తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయి. మరింత ధీటుగా బదులిస్తన్న సైన్యం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపింది." అని చినార్ కార్ప్స్ Xలో తెలిపింది.
"... ఇప్పటివరకు ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ అఖల్ కొనసాగుతోంది" అని వివరించింది.
దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని అఖల్‌లో భద్రతా దళాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించింది. దీన్ని గమనించిన ఉగ్రవాదులు సైన్యం పైకి కాల్పులు చేయడం ప్రారంభించాయి.
#WATCH | J&K | Encounter between the security forces and terrorists is underway in the Akhal area of Kulgam district. SOG, J&K Police, Army and CRPF are carrying out the operation. One terrorist has been neutralised so far.
— ANI (@ANI) August 2, 2025
(Visuals deferred by unspecified time; no live… pic.twitter.com/7HP1vE1lXg
ఉగ్రవాదులకు దీటుగానే భారత్ సైన్యం బదులిచ్చింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, CRPF ,స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) పాల్గొన్నాయి. ఉగ్రవాదిని హతమార్చినప్పటికీ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉండవచ్చని భారత సైన్యం చినార్ కార్ప్స్ తెలిపింది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే అనుమానం ఉన్న ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలానే అఖ్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. అనుమానాస్పద కదలికలు గుర్తించి అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. హతమైన ఉగ్రవాది గుర్తింపు ఇంకా నిర్ధారించలేదు.
వీళ్లంతా లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. వీరి కోసం గాలిస్తున్న సైన్యంపై కాల్పులు జరుపుతున్నారు. దీంతో ఆపరేషన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి భద్రతా దళాలు ఆ ప్రాంతం కార్డన్‌ను బలోపేతం చేశాయి. అదనపు భద్రతా దళాలను ఘటనా స్థలానికి చేరుకున్నాయి.





















