అన్వేషించండి

Saamana On BRS: బీజేపీ బీ టీం బీఆర్‌ఎస్‌, ఒవైసీ ప్లేస్‌లో కేసీఆర్‌ను పంపారని సామ్నా ఆగ్రహం

Saamana On BRS: తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం మహారాష్ట్రలోని పండరీపూర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు.

Saamana On BRS: మహారాష్ట్రలో పార్టీని విస్తరించే పనిలో కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇప్పటికే చాలా సార్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. రీసెంట్‌గా రెండు రోజల పాటు అక్కడ భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. మంగళవారం భారీ బహిరంగ సభను పండరీపూర్‌లో పెట్టారు. అక్కడ మాట్లాడిన కేసీఆర్‌ రాజకీయపార్టీలపై తీవ్రవిమర్శలు చేసారు. దీనిపై శివసేన మండిపడింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలతో కాలమ్‌ రాసింది. ఒవైసీ తర్వాత హైదరాబాద్ నుంచి మరో బృందాన్ని మహారాష్ట్రకు పంపించారని కామెంట్ చేసింది. 

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీకి లాభం చేకూర్చడమే బీఆర్ఎస్ టార్గెట్‌ అంటూ విమర్శలు చేసింది శివసేన. తన కుమార్తె కవితను ఈడీ కేసుల నుంచి తప్పించడానికి కేసీఆర్ ఇదంతా చేస్తున్నారా అని ప్రశ్నించింది. 

కేసీఆర్ వల్ల బీజేపీకే లాభం: సామ్నా

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ విచారణకు పిలిచింది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి, తెలంగాణలోని కొందరు మద్యం కాంట్రాక్టర్లకు కవిత మధ్యవర్తిగా వ్యవహరించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయని తెలిపారు. కానీ వారు తీసుకుంటున్న రాజకీయ అడుగులు పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చేవేనన్నారు. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని, 2019 నుంచి బీజేపీకి అనుకూలంగా ఓట్లు చీలుస్తున్న ఒవైసీకి కూడా హైదరాబాద్‌లోనే ప్రధాన కార్యాలయం ఉంది. ఓట్లను చీల్చేందుకు ఒవైసీ మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఆయన తన పని తాను చేసుకుపోయారు కానీ ఒవైసీ ట్రిక్‌ను అర్థం చేసుకున్న తర్వాత ముస్లింలు, దళితులు ఎంఐఎం ఉచ్చులో పడబోరని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఒవైసీ స్థానంలో కేసీఆర్‌ను బీజేపీ నియమించిందా? బీజేపీకి 'బీ' టీమ్ గా కేసీఆర్, ఆయన పార్టీ పనిచేస్తోందా? అని సామ్నాలో శివసేన ఆరోపించింది. 

కేసీఆర్‌ను బీజేపీ వాడుకుంటోందని ఆ కథనంలో ఆరోపించారు. మహారాష్ట్రలో ఈ పార్టీ (బీఆర్ఎస్) ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి రాజకీయంగా సహాయపడుతుందా, ఈ ట్రిక్‌ను స్థానిక ప్రజలు సకాలంలో గుర్తించాలి. కానీ మొత్తం మీద ఆయన పార్టీ భారత రాష్ట్ర సమితి ఓట్లు చీల్చి బిజెపికి పట్టం కట్టడానికే పనిచేస్తుంది. నిజం చెప్పాలంటే తెలంగాణలో కేసీఆర్ పార్టీకి ప్రమాదం పొంచి ఉంది. ఆయన కాళ్ల కిందకు నీళ్లు వచ్చేశాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget