Russia Ukraine Crisis: పుతిన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ, రెండు దేశాల మధ్య హింసను తక్షణమే ఆపాలని విజ్ఞప్తి
Russia Ukraine Crisis: ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారు.
ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు టెలిఫోన్‌లో మాట్లాడారు.
ఉక్రెయిన్‌కు సంబంధించి ఇటీవలి పరిణామాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి వివరించారు. రష్యా, నాటో మధ్య ఉన్న విభేదాలు నిజాయితీ, నిజాయితీతో కూడిన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవచ్చని పుతిన్‌కు మోదీ సూచించారు.
PM Modi and President Putin agreed that their officials and diplomatic teams would continue to maintain regular contacts on issues of topical interest: PMO
— ANI (@ANI) February 24, 2022
సమయోచిత ఆసక్తి ఉన్న అంశాలపై అధికారులు, దౌత్య బృందాలు రెగ్యులర్ చర్చలు కొనసాగించాలని ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు.
PM Modi appealed for an immediate cessation of violence, and called for concerted efforts from all sides to return to the path of diplomatic negotiations and dialogue: Prime Minister's Office
— ANI (@ANI) February 24, 2022
ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు, విద్యార్థుల భద్రతకు సంబంధించి భారతదేశ ఆందోళన చెందుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ వివరించారు. వారిని సురక్షితంగా స్వదేశానికి పంపించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిపారు. ఇదే తమ తొలి ప్రాధాన్యతగా మోదీ పేర్కన్నట్టు పీఎంవో ప్రకటించింది.
PM Narendra Modi speaks to Russian President Vladimir Putin
— ANI (@ANI) February 24, 2022
Pres Putin briefed PM about the recent developments regarding Ukraine. PM reiterated his long-standing conviction that the differences between Russia & NATO can only be resolved through honest and sincere dialogue: PMO
పుతిన్‌తో మాట్లాడటానికి ముందు ప్రధాని మోదీ కేబినెట్ కమిటీ (సిసిఎస్)తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు.