అన్వేషించండి

ముందు టైమ్ ఇచ్చాం, ఆ తరవాతే ఆంక్షలు విధించాం - పేటీఎమ్ సంక్షోభంపై RBI గవర్నర్

Paytm Payments Bank: పేటీఎమ్‌కి తగిన సమయం ఇచ్చిన తరవాతే ఆంక్షలు విధించినట్టు RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

Paytm Payments Bank Crisis:  రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై (Paytm Bank Crisis) స్పందించారు. ఆంక్షలు విధించే ముందే ఆ సంస్థకి తగిన సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. వాళ్ల తప్పుల్ని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఆంక్షలు విధించినట్టు వెల్లడించారు. తాము ఎప్పుడూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోమని తెలిపారు. సూపర్‌వైజరీ సిస్టమ్‌ని బలోపేతం చేశామని, ఏ సంస్థలో ఇలాంటి అవకతవకలు కనిపించినా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. పేటీఎమ్‌ సంస్థలోని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు అవసరమైన సమయాన్ని ఇచ్చినట్టు తెలిపారు. 

"మా నిఘా వ్యవస్థని చాలా బలోపేతం చేశాం. ఒక్క పేటీఎమ్ విషయంలోనే కాదు. ఏ సంస్థలో ఇలాంటి అవతకవతకలు అనిపించినా వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. ఏ సంస్థ అయినా తప్పులు సరిదిద్దుకోవాలన్నదే మా ఉద్దేశం. ఆంక్షలు విధించే ముందు తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పాం. అందుకు తగిన సమయాన్నీ ఇచ్చాం. మాతో సరైన విధంగా సంప్రదింపులు జరపకపోతే...మేం అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోతే అప్పుడే మేం చర్యలు తీసుకుంటాం"

- శక్తికాంత దాస్, RBI గవర్నర్ 

 

వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ చర్యలు తీసుకుంటున్నామని శక్తికాంత దాస్ వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే..ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేనని, వచ్చే వారం కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం Paytm Payment Bank పై ఆంక్షలు విధించడం ఆ సంస్థను బాగా దెబ్బ తీసింది. ఇప్పటికే స్టాక్‌మార్కెట్‌లో భారీగా నష్టపోయింది. ఈ క్రమంలోనే పేటీఎమ్‌ సీఈవో విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekhar Sharma) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 6వ తేదీన ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుత సంక్షోభంపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం.

ఇప్పటికే RBI ఉన్నతాధికారులతో ఓ సారి భేటీ అయ్యారు శేఖర్ శర్మ. అయితే...ఆంక్షలు ఎత్తివేస్తామన్న భరోసా మాత్రం RBI ఇవ్వలేదు. అందుకే....నేరుగా ఆర్థిక మంత్రినే కలవాలని సీఈవో భావించినట్టు తెలుస్తోంది. అటు ఈడీ కూడా ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారించేందుకు సిద్ధమైంది. కానీ అటు పేటీఎమ్ సంస్థ మాత్రం బ్యాంక్‌కి అవసరమైన వివరాలన్నీ  సమర్పించినట్టు వెల్లడించింది. ఈడీ దర్యాప్తుని తిరస్కరించింది. ఈ వదంతులను ఎవరూ నమ్మకూడదని వెల్లడించింది పేటీఎమ్ సంస్థ. ఇవి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది. తమ వినియోగదారులో తాము పూర్తి పారదర్శకంగా ఉన్నామని తేల్చి చెప్పింది. మనీలాండరింగ్ ఏమీ జరగలేదని, అయినా మేం విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని వెల్లడించింది. 

Also Read: 2025 నాటికి 20 లక్షల మందికి AI స్కిల్స్‌లో శిక్షణ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Embed widget