Lok Sabha Speaker Om Birla: మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
Om Birla : కీలకమైన చర్చలు జరిగే టైంలో లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఉండటం బాగుందన్నారు ప్రధానమంత్రి మోదీ. ఆయన మార్గదర్శకత్వ అవసరం ఇంకా ఉందని అభిప్రాయపడ్డారు.
PM Modi: రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధానమంత్రి మోదీ అభినందించారు. ఆయన్ని సభాపతి స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత మాట్లాడిన ప్రధానమంత్రి... 'సభ మొత్తాన్ని అభినందిస్తున్నాను. రాబోయే ఐదేళ్లలో మీరు మాకు మార్గనిర్దేశం చేస్తారని మేమంతా నమ్ముతున్నాము. అని అన్నారు.
కొత్త రికార్డులు సృష్టిస్తున్నాం: ప్రధాని మోదీ
రాబోయే ఐదేళ్లలో అందరికీ మార్గనిర్దేశనం చేస్తారని మేమంతా నమ్ముతున్నాం' అని ప్రధాని మోదీ అన్నారు. వినయంగా, చాకచక్యంగా వ్యవహరించే వ్యక్తి విజయవంతమైన వ్యక్తితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయని గుర్తు చేశారు. రెండోసారి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి సరికొత్త రికార్డులు సృష్టించారన్నారు. ఐదేళ్ల పదవీకాలం పూర్తైన తర్వాత బలరాం జాఖర్‌కు రెండోసారి స్పీకర్ బాధ్యతలు అప్పగించారు. వారి తర్వాత ఆ అవకాశం దక్కించుకున్న వ్యక్తి బిర్లా అంటూ కితాబు ఇచ్చారు. మీరు విజయం సాధించారని అన్నారు.
సీబీఐ చేతికి ఏపీ మద్యం స్కాం కేసు - టీడీపీ, బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయా ?
బిర్లా చిరునవ్వును సభను సంతోషంగా ఉంచుతుందన్న మోదీ
మీ మధురమైన చిరునవ్వు సభ మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుందని ప్రశంసల జల్లు కురిపించారు. మీరు రెండవసారి స్పీకర్ పదవికి ఎన్నిక కావడం గౌరవప్రదమైన విషయం అని బిర్లాను అభినందించారు. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో జరగని పనులు మీ అధ్యక్షతన ఈ సభ వల్లే సాధ్యమయ్యాయని ప్రధాని అన్నారు. కీలక బిల్లులు మీ నాయకత్వంలో ఆమోదం పొందాయని.. ప్రజాస్వామ్య సుదీర్ఘ ప్రయాణంలో అనేక మైలురాళ్లు వచ్చాయని తెలిపారు. 17వ లోక్‌సభ సాధించిన విజయాల గురించి దేశం గర్విస్తుందని తనకు చాలా నమ్మకం ఉందని మోదీ పేర్కొన్నారు..
భారీగా ఓట్లు పెంచుకున్న బీజేపీ - దక్షిణాదిలో కమల వికాసానికి పునాదులు గట్టిగా పడ్డాయా ?
మూజువాణి ఓటుతో గెలిచిన ఓంబిర్లా
లోక్ సభ స్పీకర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా గెలుపొందారు. 18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణీ ఓటుతో ఆయన గెలుపొందినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తోడ్కొని వెళ్లారు. స్పీకర్ చైర్ లో కూర్చుని వరుసగా రెండోసారి ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్ లోని కోటా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ఎంపీగా ఎన్నికయ్యారు. వరుసగా అక్కడి నుంచే మూడోసారి గెలిచి సభలో అడుగుపెట్టారు. 17వ లోక్ సభ స్పీకర్ గా సేవలందించారు.