అన్వేషించండి

PM Modi Speech: సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ, దేశ వ్యాప్తంగా ఉత్కంఠ

నేడు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నవరాత్రి ప్రారంభం, GST తగ్గింపుల అమలు నేపథ్యంలో ప్రసంగం.

PM Modi To Address The Nation | న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే, సాయంత్రం ఆయన ప్రసంగం అంశంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ రేపటి నుంచి జీఎస్టీ కొత్త స్లాబ్స్ అమల్లోకి రానుండటం, మరోవైపు అమెరికా H1b Visa ఫీజు లక్ష డాలర్లు చేసిన సమయంలో ప్రధాని మోదీ ప్రసంగంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నవరాత్రి వేడుకలకు ఒకరోజు ముందు ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. నవరాత్రి తొలిరోజు (సెప్టెంబర్ 22) నుంచే GST రేటు కోతలు అమల్లోకి వస్తాయి. కొత్త GST సంస్కరణలతో చాలా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.

భారతదేశానికి పెద్ద శత్రువు ఎవరూ లేరు

ప్రధాని మోదీ శనివారం గుజరాత్‌ను సందర్శించారు. అక్కడ బావ్‌నగర్ నుంచి రూ. 34,200 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. భావ్‌నగర్‌లో జరిగిన 'సముద్ర సే సమృద్ధి' కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇతర దేశాలపై ఆధారపడటమే భారతదేశానికి ప్రధాన శత్రువు అని అన్నారు. "భారతదేశం ప్రపంచ సోదరభావ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. నేడు ప్రపంచంలో భారతదేశానికి పెద్ద శత్రువు ఎవరూ లేరు, కానీ నిజమైన అర్థంలో, భారతదేశానికి అతిపెద్ద శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమే" అని ప్రధాని మోదీ అన్నారు, భారతదేశం యొక్క ఆధారపడటాన్ని సమిష్టిగా ఓడించాలని నొక్కి చెప్పారు.

దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ఆదివారం ఉదయం ప్రధాని మోదీ మహాలయ అమావాస్య సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గా పూజ పవిత్ర రోజులు సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరి జీవితం వెలుగులు, లక్ష్యంతో నిండి ఉండాలని ఆకాంక్షించారు. "దేవి దుర్గా మాత కైలాస పర్వతం నుండి భూమికి ఈ రోజున దిగి వస్తుందని భక్తులు నమ్ముతారు" అందరికీ శుభో మహాలయ! దుర్గా పూజ నవరాత్రి సమీపిస్తున్నందున, మన జీవితాలు వెలుగులతో ఉండాలని కోరుకుంటున్నాను" అని మోదీ X లో అన్నారు. "మా దుర్గా మాత దైవిక ఆశీర్వాదాలు అచంచలమైన బలం, శాశ్వతమైన ఆనందం, అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకురావాలి" అని ఆయన అన్నారు.

H-1B వీసాల రుసుము ఏడాదికి 100,000 డాలర్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల రుసుమును ఏడాదికి 100,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.88 లక్షలు)కు పెంచుతూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇది అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు, కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అమెరికాలో వలసలపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న సమయంలో ఈ ఉత్తర్వు జారీ అయింది. నిజంగా చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తులను మాత్రమే అమెరికాలోకి తీసుకురావాలని, అక్కడి కంపెనీలు అమెరికన్లను భర్తీ చేయడం పెంచాలన్నదే లక్ష్యంగా ట్రంప్ పెట్టుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget