అన్వేషించండి

Pahalgam Attack Anniversary: భారత్ ఉగ్రవాదానికి ఎప్పటికీ తలవంచదు.. పహల్గామ్ దాడికి ఏడాది సందర్భంగా పాక్‌కు ప్రధాని మోదీ అల్టిమేటం

Pahalgam Attack Anniversary: గత ఏడాది ఏప్రిల్ 22న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ 'లష్కర్-ఎ-తైబా' (LeT)కు చెందిన ఉగ్రవాదులు పహల్గామ్‌లోని బైసారన్ లోయలో కాల్పులు జరిపి 26 మందిని చంపేశారు.

Pahalgam Attack Anniversary: న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరన్ లోయలో పాక్ ఉగ్రదాడికి ఏడాది పూర్తవుతోంది. పహల్గామ్ దాడి ఏడాది సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతులను స్మరించుకుంటూ, వారిని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఏ రకమైన ఉగ్రవాదానికైనా భారత్ ఎన్నటికీ తలవంచదని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల కుట్రలు ఎన్నటికీ విజయవంతం కావని, ఈ కష్ట సమయంలో అమరులైన వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. బాధితుల కుటుంబాలకు కేంద్రం తోడుగా ఉంటుందని పేర్కొన్నారు.

పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.  ‘గతేడాది ఇదే రోజున (ఏప్రిల్ 22న) పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పౌరులను గుర్తు చేసుకుంటున్నాను. ఆ ఘటనను, అమరులైన వారిని ఎన్నటికీ మర్చిపోలేం. ఈ విచారకర సమయంలో బాధితుల కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నాను. మనమంతా ఒక దేశంగా ఈ కష్టకాలంలో దృఢ సంకల్పంతో ఒక్కటిగా ఉన్నాం. భారత్ ఎలాంటి ఉగ్రవాదానికైనా ఎప్పటికీ తలవంచదు. ఉగ్రవాదుల కుట్రలు భారత్ ఛేదిస్తుంది. ఉగ్రవాడుల పన్నాగాలు ఎన్నటికీ నెరవేరవు’ అని పేర్కొన్నారు. 

మృతుల జ్ఞాపకార్థం పహల్గామ్‌లో స్మారక నిర్మాణం
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించగా.. వీరిలో ఒకరు విదేశీయుడు ఉన్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించేందుకు అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. లిద్దర్ నది ఒడ్డున నల్లరాతితో నిర్మించిన ఈ స్మారకంపై 26 మంది మృతుల పేర్లు చెక్కారు. ఈ భయానక ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రాంతంలో భద్రతను కూడా పెంచారు.

మతం అడిగి మరీ కాల్చి చంపిన ఉన్మాదులు 
2025 ఏప్రిల్ 22న పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదులు పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీకి విహారానికి వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ప్రజల పేర్లు, మతం అడిగి తెలుసుకుని, మహిళలు, పిల్లల ముందే వారిని కాల్చి చంపేశారు. మీ మోదీకి చెప్పుకోండి అని అంటూ అమాయకుల్ని కాల్చి చంపడాన్ని దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు, పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

ఆపరేషన్ సిందూర్‌తో 100 మందికి పైగా ఉగ్రవాదుల హతం
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి పీఓకేతో పాటు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పీఓకే, పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని భారత ప్రభుత్వం పేర్కొంది. 2025 జూలై 28న 'ఆపరేషన్ మహాదేవ్' కింద పహల్గామ్‌లో కాల్పులు జరిపిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget