11వ శతాబ్దపు చోళ రాజవంశానికి చెందిన రాగి శాసనాలు (కాపర్ ప్లేట్స్) నెదర్లాండ్స్ నుండి తిరిగి భారత్‌కు రానున్నాయి.
PM Modi: 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
PM Modi Netherlands Visit: 11వ శతాబ్దపు చోళ వంశానికి చెందిన రాగి శాసనాలను నెదర్లాండ్స్ నుండి భారతదేశానికి తిరిగి తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

- నెదర్లాండ్స్‌లో మోదీ: చోళుల రాగి శాసనాలు తిరిగి భారత్‌కు.
- 11వ శతాబ్దపు 24 రాగి పలకలు భారత్‌కు రానున్నాయి.
- భారత్, నెదర్లాండ్స్ సప్లై చైన్, ఇంధన భద్రతపై కలిసి పనిచేస్తాయి.
- ట్యులిప్, కమలంలా భారత్-నెదర్లాండ్స్ సహకారంపై మోదీ ప్రస్తావించారు.
PM Modi Latest News | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (మే 16) నాడు రాయల్ ప్యాలెస్‌లో నెదర్లాండ్స్ రాజు విల్లెమ్- అలెగ్జాండర్, రాణి మాక్సిమాలతో భేటీ అయ్యారు. అనంతరం భారత ప్రజలకు ఆయన శుభవార్త చెప్పారు. 11వ శతాబ్దపు (చోళ కాలం) చోళ రాజవంశానికి చెందిన రాగి శాసనాలు (కాపర్ ప్లేట్స్) నెదర్లాండ్స్ నుండి తిరిగి భారత్‌కు తిరిగి రానున్నాయని పీఎం మోదీ తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై మోదీ మాట్లాడుతూ.. ఇది ప్రతి భారతీయుడికి ఎంతో సంతోషకరమైన క్షణమని అన్నారు.
భారత్‌కు తీసుకురాబడనున్న చోళ తామ్రపత్రాలు
విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఎక్స్ లో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. 'ప్రతి భారతీయుడికీ ఇది ఎంతో సంతోషకరమైన క్షణం. చోళ రాజవంశానికి చెందిన రాగి పలకలు (రాగి శాసనాలు) నెదర్లాండ్స్ నుండి భారత్‌కు తిరిగి రానున్నాయి. ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ సమక్షంలో, నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ చోళ కాపర్ ప్లేట్లు మొత్తం 24 ప్లేట్ల సెట్ ఉండగా, ఇందులో 21 పెద్ద, 3 చిన్న ప్లేట్లు ఉన్నాయి. వీటిపై ప్రపంచంలోని అత్యంత అందమైన భాషలలో ఒకటైన తమిళ భాషలో వ్యాసాలు రాశారు. ఈ పత్రాలు గ్రేట్ కింగ్ రాజేంద్ర చోళ 1 (Rajendra Chola I) కాలం నాటివి. ఆయన తన తండ్రి అయిన రాజు రాజరాజ 1 చేసిన ఒక మౌఖిక వాగ్దానానికి అధికారిక రూపం ఇచ్చారు.'

'ఇవి చోళుల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. భారతీయులు చోళులు, వారి సంస్కృతి, వారి నౌకాదళ శక్తి గురించి ఎంతో గర్విస్తాం. నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, ప్రత్యేకించి 19వ శతాబ్దం మధ్యకాలం నుంచి ఈ తామ్రపత్రాలను భద్రపరిచిన లైడెన్ యైనివర్సిటీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ రాగి ప్లేట్లు 100 సంవత్సరాలకు పైగా నెదర్లాండ్స్ వద్ద ఉన్నాయని’ ప్రధాని మోదీ తెలిపారు.

నెదర్లాండ్స్, భారత్ కలిసి పనిచేస్తున్నాయి: పీఎం మోదీ
విశ్వసనీయమైన, పారదర్శకమైన, మెరుగైన భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న సప్లై చైన్‌ను నిర్మించడానికి భారత్, నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. 'ఇంధన భద్రత నుండి నీటి సంరక్షణ వరకు, నెదర్లాండ్స్, భారత్ కలిసి పనిచేస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్‌పై మన సహకారం చాలా ముఖ్యం. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని' అన్నారు.
Sharing my remarks during the CEOs Roundtable in the Netherlands. https://t.co/wVpjGnbuIZ
— Narendra Modi (@narendramodi) May 16, 2026
నెదర్లాండ్స్ ట్యులిప్స్ (Tulips) కు ప్రసిద్ధి చెందిన విషయాన్ని ప్రస్తావించారు. భారత్ తామర (కమలం) కు ప్రసిద్ధి చెందిందని మోదీ అన్నారు. 'ట్యులిప్, కమలం రెండూ మనకు చాలా విషయాలు నేర్పుతాయి. వేర్లు నీటిలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా, రెండూ అందాన్ని, శక్తిని పొందుతాయి. భారత్, నెదర్లాండ్స్ అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేసుకుంటాయి. ప్రపంచ ప్రాజెక్టులను సాధించడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని' అన్నారు. కాలక్రమేణా అనేక నాగరికతలు అంతరించిపోయాయని, కానీ భారత వైవిధ్యభరితమైన సంస్కృతి నేటికీ ఇక్కడి ప్రజల హృదయాలలో నిలిచి ఉందన్నారు.
Frequently Asked Questions
నెదర్లాండ్స్ నుండి భారత్‌కు ఏ చారిత్రాత్మక వస్తువులు తిరిగి రానున్నాయి?
తిరిగి రానున్న చోళ రాగి శాసనాలలో ఎన్ని ఉన్నాయి మరియు వాటిపై ఏ భాషలో ఉంది?
మొత్తం 24 ప్లేట్ల సెట్ ఉండగా, ఇందులో 21 పెద్ద, 3 చిన్న ప్లేట్లు ఉన్నాయి. వీటిపై తమిళ భాషలో వ్యాసాలు రాశారు.
ఈ చోళ రాగి శాసనాలు ఏ రాజు కాలం నాటివి?
ఈ పత్రాలు గ్రేట్ కింగ్ రాజేంద్ర చోళ 1 కాలం నాటివి. ఆయన తన తండ్రి రాజు రాజరాజ 1 చేసిన వాగ్దానానికి అధికారిక రూపం ఇచ్చారు.
భారత్, నెదర్లాండ్స్ ఏ రంగాలలో కలిసి పనిచేస్తున్నాయి?
విశ్వసనీయమైన, పారదర్శకమైన సప్లై చైన్‌ను నిర్మించడానికి, ఇంధన భద్రత, నీటి సంరక్షణ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలలో భారత్, నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు






















