అన్వేషించండి

TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!

TGPSC Recruitment 2026: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 290 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • TGPSC రోడ్లు, భవనాల శాఖలో 290 ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
  • ఆర్&బీ శాఖలో 222 సివిల్, 49 ఎలక్ట్రికల్ AEE పోస్టులు ఉన్నాయి.
  • కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ భర్తీ చేయనుంది.
  • వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచారు, అక్టోబర్ 2026లో పరీక్షలు.

TGPSC Recruitment 2026: తెలంగాణ ప్రభుత్వ కొలువు కోసం ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్ పట్టభద్రులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్లు, భవనాల శాఖతోపాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 290 పోస్టులతో విడుదలైన ఈ నోటిఫికేషన్లు, నిరుద్యోగ యువతలో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూడు ప్రధాన విభాగాల్లో ఖాళీలను భర్తీ 

ఆర్‌ అండ్ బీ శాఖలో అత్యధికంగా 222 AEE(సివిల్) ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ శాఖలోనే 49 AEE(ఎలక్ట్రికల్‌) ఖాళీలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణ మండలి బోర్డులో 19 అసిస్టెంట్‌ ఎన్విరాన్మెంట్‌ ఇంజనీర్‌ భర్తీ చేయనుంది. 

మొత్తం 290 పోస్టులకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాల ఎంపికైన వారికి 54, 220 నుంచి 1,33,630 వరకు భారీ వేతన శ్రేణి లభిస్తుంది. 

ప్రభుత్వం గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచడం ద్వారా పదేళ్ల సడలింపు ఇవ్వడంతో సీనియర్ అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశంగా మారింది. 

ప్రతి విభాగం ద్వారా దరఖాస్తులు వేర్వేరు తేదీల్లో ప్రారంభమవుతాయి. అభ్యర్థులు కమిషన్ సూచించిన షెడ్యూల్‌ ప్రకారం అప్లై చేయాలి. 

పోస్ట్‌ పేరు   దరఖాస్తు ప్రారంభం   చివరి తేదీ 
ఏఈఈ(సివిల్) R&B   06/06/2026  13/07/2026
ఏఈఈ(ఎలక్ట్రికల్) R&B   08/06/2026  15/07/2026
అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్‌  10/06/2026 17/06/2026

ఈ పోస్టులకు రాత పరీక్షలు తాత్కాలికంగా అక్టోబర్‌ 2026లో నిర్వహించనున్నట్టు కమిషన్ ప్రకటించింది. హాల్‌ టికెట్‌లను పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ముందు తమ విద్యార్హతలను, వయసును సరిచూసుకోవాలి. 

  • సివిల్‌ ఏఈఈ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ కలిగి ఉండాలి.
  • ఎలక్ట్రికల్ ఏఈఈ:- సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉండాలి. 
  • ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్:- నోటిఫికేషన్‌ పేర్కొన్న పర్యావరణ విభాగాల్లో విద్యార్హతలు అవసరం 
  • డిస్టెన్స్ విధానంలో డిగ్రీ పొందిన వారు UGC/ AICTE గుర్తింపును కలిగి ఉండటం తప్పనిసరి. 
  • వయోపరిమితి:- 01/07/2026 నాటికి అభ్యర్థి వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానం విధానంలో ఉంటుంది. దీని కోసం అభ్యర్థులు అనుసరించాల్సిన దశలు ఉన్నాయి. 

  • ముందుగా టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఇంతకు ముందు రిజిస్టర్‌ చేసుకోని వారు ముందుగా OTR(వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్) పూర్తి చేసుకోవాలి. దీని ద్వారా యూజర్ ఐడీ పొందుతారు. 
  • కమిషన్ వెబ్‌సైట్‌(www.tgpsc.gov.in) సందర్శించి, మీ ఓటీఆర్‌ ఐడీతో లాగిన్ అవ్వాలి. 
  • నోటిఫికేషన్‌లోని నిబంధనలను పూర్తిగా చదివి, మీ వివరాలను సరిచూసుకున్న తర్వాతే దరఖాస్తును సమర్పించాలి. 
  • పరీక్ష అబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. ఇది ఓఎంఆర్‌ ఆధారితంగా లేదా కంప్యూటర్‌ ఆధారిత పద్ధతిలో ఉండొచ్చు. వివిధ సెషన్స్‌లో పరీక్ష నిర్వహిస్తే నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా మార్కులు లెక్కిస్తారు. 

అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, దరఖాస్తు గడువు ముగియడానికి ముందే అప్లై చేసుకోవడం ఉత్తమం.  

Frequently Asked Questions

TGPSC ద్వారా ఏయే పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది?

రోడ్లు, భవనాల శాఖ మరియు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (AEE) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 290 పోస్టులున్నాయి.

AEE (సివిల్) మరియు AEE (ఎలక్ట్రికల్) పోస్టులు ఏ శాఖలో ఉన్నాయి?

ఆర్&బి (R&B) శాఖలో 222 AEE (సివిల్) మరియు 49 AEE (ఎలక్ట్రికల్) పోస్టులు ఉన్నాయి. అలాగే, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి ఎంత?

01/07/2026 నాటికి అభ్యర్థి వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితి 34 నుండి 44 ఏళ్లకు పెంచారు.

AEE (సివిల్) పోస్ట్‌కు అర్హతలు ఏమిటి?

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ కలిగి ఉండాలి. డిస్టెన్స్ విధానంలో డిగ్రీ పొందినవారు UGC/ AICTE గుర్తింపు కలిగి ఉండాలి.

రాత పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?

రాత పరీక్షలు తాత్కాలికంగా అక్టోబర్‌ 2026లో నిర్వహించనున్నట్టు కమిషన్ ప్రకటించింది. హాల్‌ టికెట్‌లు పరీక్షకు ఏడు రోజుల ముందు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget