(Source: ECI/ABP News/ABP Majha)
Jalianwala bagh Smarak: జలియన్‌వాలా బాగ్ మెమోరియల్ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కొత్త హంగులు సంతరించుకున్న జలియన్ వాలాబాగ్ స్మారకాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. కొత్త హంగులు సంతరించుకున్న జలియన్ వాలాబాగ్ స్మారాకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మారకాన్ని జాతికి అంకితం చేశారు. స్మారకంలో అభివృద్ధి చేసిన మ్యూజియం గ్యాలరీలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ హాజరయ్యారు.
నాలుగు మ్యూజీయం గ్యాలరీలు, నిరూపయోగంగా ఉన్న భవనాలకు కొత్త హంగులు.. అద్దారు. దీర్ఘకాలం పాటు పరిమిత ఆదరణకు మాత్రమే నోచుకున్న ఈ చారిత్రక ప్రాంతం ఇప్పుడు నూతన హంగులను సంతరించుకుంది. అప్పట్లో పంజాబ్ లో జరిగిన సంఘటనలు, చారిత్రక వస్తువులను ఈ గ్యాలరీలో పెట్టారు.
Also Read: Bengal BJP vs Mamata : దీదీ మేనల్లుడికి ఈడీ సమన్లు.. బెంగాల్‌లో మళ్లీ రాజకీయ రచ్చ..!
అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ మెమోరియల్ కాంప్లెక్స్ ను నాలుగు మ్యూజియం గ్యాలరీలతో రినోవేట్ చేశారు. మ్యూజియం గ్యాలరీల ఏర్పాటులో మోడర్న్ ఆడియో విజువల్ టెక్నాలజీ వాడారు. ఏప్రిల్ 13న జరిగిన ఘటనను ప్రదర్శించడానికి ప్రత్యేకంగా సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేశారు. పంజాబ్‌లో జరిగిన సంఘటనలు కళ్లకుకట్టేలా శిల్ప సౌందర్యాన్ని తీర్చిదిద్దారు. లోకల్ ఆర్కిటెక్చర్ శైలికి అనుగుణంగా మెమోరియల్ కాంప్లెక్స్ హెరిటేజ్ రినోవేషన్ పనులు చేపట్టారు.
Also Read: Aadhaar-PAN: ఆధార్, పాన్ లింక్ సేవల్లో అవాంతరాలకు చెక్.. సక్రమంగా పనిచేస్తున్నాయన్న యూఐడీఏఐ
స్వాతంత్య్ర ఉద్యమకాలంలో పంజాబ్‌లో జరిగిన వివిధ ఘటనలకు గుర్తుగా ఈ ప్రాంతం పేరొందింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. జ్వాలా స్మారకానికి మరమ్మతులు చేయడంతో పాటు, పలు పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ‘లిలీ తలాబ్’ను అభివృద్ధి చేయడంతో పాటు రహదారులను మరింత విశాలంగా మార్చారు.
Also Read: Super Stalin : స్టాలిన్ సూపర్..! ఆ బ్యాగుల వల్ల తమిళనాడు సీఎంకు ఎన్ని ప్రశంసలంటే..?
దేశ స్వాతంత్య్ర పోరాటంలో నెత్తుటి అధ్యాయం ఘటన జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్13న వైశాఖి పర్వదిన వేడుకల్లో పాల్గొన్న అమాయకులపై బ్రిటీష్ బ్రిగేడియర్- జనరల్ రెజినాల్డ్ డయ్యర్ నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించాడు. ఈ మారణకాండలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు అమృత్సర్ సిటీలో జలియన్‌వాలాబాగ్ స్మారకాన్ని ఏర్పాటు చేశారు.
Also Read: Uthra Murder Case: పాముతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంట్రస్టింగ్ కేసు ఇది