Aadhaar-PAN: ఆధార్, పాన్ లింక్ సేవల్లో అవాంతరాలకు చెక్.. సక్రమంగా పనిచేస్తున్నాయన్న యూఐడీఏఐ
గత కొద్ది రోజులుగా ఆధార్ సేవల్లో ఎదురవుతోన్న అవాంతరాలకు చెక్ పెట్టినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇకపై తమ సేవలన్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా స్థిరంగా పనిచేస్తాయని చెప్పింది.
గత కొద్ది రోజులుగా ఆధార్ సేవల్లో ఎదురవుతోన్న అవాంతరాలకు చెక్ పెట్టినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వెల్లడించింది. ఇకపై తమ సేవలన్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా స్థిరంగా పనిచేస్తాయని చెప్పింది. కాగా, ఇటీవల మొబైల్ నంబర్, ఇతర ఎన్‌రోల్‌మెంట్ చేసేటప్పుడు అవాంతరాలు ఎదురవుతున్నాయని పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఆధార్, పాన్ కార్డు/ ఈపీఎఫ్ఓ ఖాతాలను లింక్ చేసే సమయంలో ఎర్రర్ మెసేజ్ లు దర్శనమిచ్చాయని చెప్పారు. దీంతో వీటికి చెక్ పెట్టేందుకు యూఐడీఏఐ చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా గత వారం రోజులుగా తమ సిస్టమ్స్‌లో అవసరమైన సెక్యూరిటీలను అప్‌గ్రేడ్ చేసినట్లు యూఐడీఏఐ వెల్లడించింది. ఇప్పుడు ఈ సర్వీసులన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని చెప్పింది.
#uidaiupdate
— Aadhaar (@UIDAI) August 28, 2021
There have been no outages in the #Aadhaar – #PAN/#EPFO linking facility. All its services are stable and functioning fine. For more details please click the following link: https://t.co/CuLrGDeiEb
సమస్య పరిష్కరించినప్పటికీ.. యూజర్లు ఇంకా ఏమైనా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. 2021 ఆగస్టు 20న అప్‌గ్రేడ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గత 9 రోజుల వ్యవధిలో 51 లక్షల మందికి పైగా ఎన్‌రోల్ చేసుకున్నారని పేర్కొంది. రోజుకు సగటున 5.68 లక్షల మంది ఎన్‌రోల్ చేసుకున్నట్లు వెల్లడించింది.
Unique Identification Authority of India (UIDAI) today said that all its services are stable and functioning fine. There have been no outages in its Aadhaar-PAN/EPFO linking facility which is an authentication-based facility: Ministry of Electronics & IT pic.twitter.com/KjAhl6JXdm
— ANI (@ANI) August 28, 2021
Also Read: Bengal BJP vs Mamata : దీదీ మేనల్లుడికి ఈడీ సమన్లు.. బెంగాల్‌లో మళ్లీ రాజకీయ రచ్చ..!
Also Read: Super Stalin : స్టాలిన్ సూపర్..! ఆ బ్యాగుల వల్ల తమిళ నాడు సీఎంకు ఎన్ని ప్రశంసలంటే..?