అన్వేషించండి

Bengal BJP vs Mamata : దీదీ మేనల్లుడికి ఈడీ సమన్లు.. బెంగాల్‌లో మళ్లీ రాజకీయ రచ్చ..!

బొగ్గు స్కాంలో విచారణకు హాజరు కావాలని మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌, ఆయన భార్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. దర్యాప్తు సంస్థలతో కాదని రాజకీయంగా ఎదుర్కోవాలని మమతా బెనర్జీ బీజేపీకి సవాల్ చేశారు.


బెంగాల్ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత ప్రారంభమయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి,  ఆయన భార్య రుచిరా బెనర్జీకి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీన రుచిరా, ఆరో తేదీన అభిషేక్ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. బెంగాల్లో బొగ్గు స్కాం జరిగిందని దానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. అభిషేక్ బెనర్జీ దంపతులతో పాటు ఇద్దరు సీనియర్ అధికారులకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. 
 
బెంగాల్‌లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ బొగ్గు గనులున్నాయి.  బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకుకుని అమ్ముకున్నారని సీబీఐ కేసు పెట్టింది. గత ఏడాది నవంబర్‌లో సీబీఐ బొగ్గు స్కాంపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించే నోటీసులు జారీ చేశామని ఈడీ తెలిపింది. ఈ వ్యవహారంతో అభిషేక్ బెనర్జీ భార్య రుచిరా, ఆమె సోదరి మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ కేసులు పెట్టింది. అక్రమమైనింగ్‌ వ్యవహారంలో అభిషేక్  అని ఈడీ ఆరోపిస్తోంది. అయితే ఎన్నికలకు ముందు ఆరోపణలు చేసి.. మళ్లీ చాలా రోజుల తర్వాత తెరపైకి తీసుకు రావడం అంతా రాజకీయం అని తృణమూల్ ఆరోపిస్తోంది. తృణమూల్‌లో పార్టీ వ్యవహారాలు ఎక్కువగా అభిషేక్ బెనర్జీనే చక్కబెడుతూంటారు. 

గత ఎన్నికల సమయంలో ఈ స్కాం కూడా రాజకీయ అంశం అయింది. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తమను వేధిస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. తాజా ఈడీ నోటీసులపైనా మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశాన్ని తెగనమ్మేసిన బీజేపీ బొగ్గు కుంభకోణంలో తృణమూల్‌ను వేలెత్తి చూపించలేరని.. దమ్ముంటే తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె సవాల్‌ విసిరారు.  బొగ్గు వ్యవహారం కేంద్రం చేతిలో ఉంటుందని, బెంగాల్, అసోల్ ప్రాంతాల్లో బొగ్గు అవినీతికి పాల్పడుతున్న బీజేపీ నేతల మాటేమిటని సూటిగా ప్రశ్నించారు. తమపై ఓ కేసు పెడితే తాము మరిన్ని కేసులను వెలుగులోకి తెస్తామని మమతా బెనర్జీ హెచ్చరించారు. గుజరాత్‌ చర్రిత ఏంటో  తెలుసన్నారు. 

బెంగాల్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అక్కడ రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే రాజకీయ హింస చెలరేగింది. ఆ ఘటనలపై దుమారం రేగింది.రాష్ట్రపతి పాలన విధిస్తామన్నట్లుగా గవర్నర్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అది సద్దుమణిగిపోయిందనుకునే లోపల  వాటిపై విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ తరుణంలో మళ్లీ కోల్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఇది రెండు పార్టీల మధ్య మరోసారి వాదోపవాదాలకు కారణం అవుతోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget