అన్వేషించండి
Advertisement
Padma Awards 2022: భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్- ఆజాద్‌కు పద్మ భూషణ్
భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్‌కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా ఆయన కూతుళ్లు అవార్డును స్వీకరించారు. కాంగ్రెస్ నేత ఆజాద్‌కు పద్మ భూషణ్ ఇచ్చారు.
దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. ఈ పురస్కారాన్ని ఆయన కుమార్తెలు క్రితిక, తరణి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ అవార్డు దక్కింది.
ఇంకెవరికంటే?
- పారా షూటర్ అవనీ లేఖరాకు క్రీడా రంగానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు దక్కింది.
- హాకీ ప్లేయర్ వందనా కటారియా పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు.
- సాహిత్యం, విద్యా రంగంలో చేసిన సేవలకు గాను సచిదానంద స్వామికి పద్మ భూషణ్ ఇచ్చారు.
- సాహిత్యం, విద్యా రంగంలో చేసిన విశేష కృషికి గాను రాధే శ్యామ్ ఖెమ్కాకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. ఆయన కుమారుడు అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
- సినిమా రంగానికి గాను డైరెక్టర్ చంద్ర ప్రకాశ్ ద్వివేదీ పద్మ శ్రీ తీసుకున్నారు.
మొత్తం 128 పద్మ పురస్కారాల్లో నలుగురికి పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం..17 మందిని పద్మభూషణ్, 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. రెండో విడత అవార్డుల ప్రదానం మార్చి 28న జరగనుంది
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion