By: ABP Desam | Updated at : 21 Mar 2022 04:10 PM (IST)
Edited By: Murali Krishna
కుర్రాడు 'బంగారం' అండి! పని చేసి 10 కిమీ పరిగెత్తి ఇంటికెళ్తాడు!
సినీ వినీలాకాంశంలో అరుణోదయ తారకలా మెరిసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలు వారిన ముత్యాలు.. ఈ మాటలు. ఈ మాటలు ఇప్పుడెందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఈ అక్షర సత్యాలైన మాటలకు నిలువెత్తు రూపంలా కనిపించాడు ఓ కుర్రాడు.
నోయిడా రహదారిపై ప్రతిరోజు రాత్రి ఓ 19 ఏళ్ల కుర్రాడు పరిగెడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ కుర్రాడ్ని గుర్తించి.. ఎందుకు పరిగెడుతున్నాడో అడిగి తెలుసుకున్నారు జాతీయ అవార్డు గ్రహీత ఫిల్మ్‌మేకర్ వినోద్ కాప్రీ. అయితే ఆ కుర్రాడి మాటలు విని డైరెక్టర్ షాకయ్యారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆ కుర్రాడు 'బంగారం' అని కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఏముందో మీరూ చూడండి.
This is PURE GOLD❤️❤️
— Vinod Kapri (@vinodkapri) March 20, 2022
नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा
किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए
बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊 pic.twitter.com/kjBcLS5CQu
వినోద్ కాప్రీ: హలో.. మీ ఇంటి దగ్గర దింపేస్తాను ఇలా రా
యువకుడు: లేదు లేదు. నేను ఇలాగే పరిగెత్తుకుంటూ వెళ్తా.
వినోద్ కాప్రీ: ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నావ్? ఏం పనిచేస్తావ్?
యువకుడు: నేను పరిగెత్తుకుంటూనే వెళ్తా. సెక్టార్ 16లోని మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేస్తా. పరిగెత్తేందుకు నాకు ఇప్పుడే సమయం దొరుకుతుంది. ఆర్మీలో చేరేందుకు నేను పరిగెడుతున్నా. పొద్దున పరిగెత్తేందుకు నాకు సమయం దొరకదు. ఇంట్లో వంట, ఇతర పునులు పూర్తి చేసుకొని మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
వినోద్ కాప్రీ: నీ పేరేంటి? నీ అమ్మనాన్న ఏం చేస్తారు?
యువకుడు: నా పేరు ప్రదీప్ మెహ్రా. మా స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని అల్మోడా. మా అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు. ఆస్పత్రిలో ఉంది. నేను నా సోదరుడితో కలిసి ఇక్కడ ఉంటున్నా.
వినోద్ కాప్రీ: లిఫ్ట్ వద్దన్నావ్.. పోనీ కనీసం డిన్నర్ కోసమైనా మా ఇంటికి రా.
యువకుడు: నా సోదరుడు నైట్ డ్యూటీకి వెళ్తాడు, త్వరగా ఇంటికి వెళ్లి ఇద్దరి కోసం నేనే వంట చేయాలి.
వినోద్ కాప్రీ: ఈ వీడియో వైరల్ అవుతుంది.
యువకుడు: నన్నెవరు గుర్తుపడతారు (నవ్వుతూ). ఒకవైళ వైరల్ అయినా.. నేనేమీ తప్పు చేయడం లేదు కదా.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎంతో మంది యువతకు ప్రదీప్ ప్రేరణగా నిలుస్తాడని సెలెబ్రెటిలీ కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రదీప్ నీకు 'దేశం' సలాం.
Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్
Viral Video: కార్‌పై క్రాకర్స్ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్
Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్ కావాలా? ఇండియన్స్‌కి క్రేజీ ఆఫర్ ఇచ్చిన థాయ్‌లాండ్
యాక్సిడెంట్ అయిన కార్లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో
ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!
TSPSC Chairman Resigns: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?
/body>