WhiteHat Jr Employees Resign: 800 మంది ఉద్యోగులు రాజీనామా- ఆఫీసుకు రమ్మంటే అట్లుంటది మరి!
WhiteHat Jr Employees Resign: ఆఫీసు నుంచి పని చేయాలని ఉద్యోగులకు హుకుం జారీ చేసిన కంపెనీలకు పెద్ద షాక్ తగులుతోంది. చాలా మంది ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారు.
WhiteHat Jr Employees Resign: కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఉద్యోగులు ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోం)కి బాగా అలవాటుపడ్డారు. ఐటీ కంపెనీలు సహా పలు రంగాలకు చెందిన సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు అవకాశం ఇచ్చాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రమ్మని పిలుస్తున్నాయి. ఇక్కడినుంచే పని చేయాలని పలు కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇది నచ్చని చాలా మంది ఉద్యోగులు కంపెనీకి షాకిస్తున్నారు.
ఆఫీసుకు రండి
కొంత మంది ఉద్యోగులు కార్యాలయానికి రావడానికి ఇష్టపడడం లేదు. ఇంటి నుంచి పని చేయడం సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. అయితే పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ముగించి ఆఫీస్ బాట పట్టాలని ఉద్యోగులకు హుకుం జారీ చేయడంతో కొంత మంది ఉద్యోగులు తమ జాబ్‌కు రాజీనామా చేస్తున్నారు.
భారీ షాక్
ఆఫీసు నుంచి పని చేయమని అడిగిన తర్వాత 800 మంది వైట్‌హ్యాట్ జూనియర్ ఉద్యోగులు గత రెండు నెలల్లో తమ జాబ్‌కు రిజైన్ చేశారు. కిడ్స్ ఆన్‌లైన్ కోడింగ్ లెర్నింగ్ ఎడ్టెక్ స్టార్ట్-అప్ నుంచి వీరు రాజీనామా చేసినట్లు ఐఎన్‌సీ42 నివేదిక తెలిపింది. ఈ వార్తలతో ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌పై పునరాలోచనలో పడ్డాయి. మరికొన్ని రోజుల పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానం అవలంబించాలని ఆలోచిస్తున్నాయి.
ఇవే లాభాలు
- ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యవంతంగానే అనిపించింది.
- ఫ్యామిలీతో ఎక్కువగా సమయం గడిపే అవకాశం దొరికింది.
- బస్సుల్లోను, బైక్‌లపైనా ట్రాఫిక్‌లో ఆపసోపాలు పడి ఆఫీసుకు వెళ్లే బాధ తప్పింది.
- పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూడటం కోసం ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడాన్ని ఇష్ట పడుతున్నారు.
- ఆఫీసుకు తిరిగి రాకూడదనే నిర్ణయానికి జీతాలు కూడా కారణమని మరికొంత మంది ఉద్యోగులు చెబుతున్నారు.
- ఇంటి నుంచి పనిచేయడం వలన ఖర్చులు కొంత మేరకు తగ్గినట్టు ఉద్యోగులు చెబుతున్నారు.
Also Read: Corona Cases: దేశంలో మరో 2,827 మందికి కరోనా- ఎంత మంది మృతి చెందారంటే?