మమ్మల్ని అంటరాని వాళ్లుగా చూస్తున్నారు, విపక్షాల భేటీకి పిలవకపోవడంపై AIMIM అసహనం
Opposition Meeting: బెంగళూరు భేటీకి ఆహ్వానం అందకపోవడంపై అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Opposition Meeting:
AIMIM తీవ్ర అసహనం..
బెంగళూరులో 26 పార్టీల భేటీపై AIMIM పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తమని తాము సెక్యులర్ అని చెప్పుకుని తిరిగే పార్టీలు తమను దూరం పెట్టాయని మండి పడింది. విపక్షాల భేటీకి తమకు ఆహ్వానం అందలేదని వెల్లడించింది. రాజకీయ పరంగా తమ పార్టీని అంటరానిదిగా చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ పార్టీని పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించింది.
"సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు మమ్మల్ని పిలవలేదు. మేము వాళ్లకు రాజకీయపరంగా అంటరాని వాళ్లుగా కనిపిస్తున్నామేమో. ఒకప్పుడు బీజేపీలో ఉన్న నితీష్ కుమార్, ఉద్దవ్ థాక్రే, మెహబూబ్ ముఫ్తీ లాంటి నేతలంతా ఒక్కటయ్యారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ని తీవ్రంగా విమర్శించారు అరవింద్ కేజ్రీవాల్. కానీ...మళ్లీ ఆయనే ఆ పార్టీ పిలిచిన మీటింగ్‌కి వెళ్లారు. 2024లో బీజేపీని ఓడించాలని మేము కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాం. కానీ వాళ్లు మాత్రం నన్ను, నా పార్టీని పట్టించుకోవడం లేదు"
- వారిస్ పఠాన్, AIMIM నేత
"We are political untouchables for them..." AIMIM leader Waris Pathan after not being invited to Bengaluru Opposition meet
— ANI Digital (@ani_digital) July 19, 2023
Read @ANI Story | https://t.co/FX9rHPlupp#AIMIM #WarisPathan #BengaluruOppositionMeeting #NDA #INDIA pic.twitter.com/zPcSOeu7UW
బెంగళూరులో జరిగిన రెండ్రోజుల భేటీకి 26 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. "United We Stand" అనే నినాదంతో మేమంతా ఒక్కటే అనే సంకేతాలిచ్చేందుకు ప్రయత్నించారు. రెండ్రోజుల చర్చలు ముగిసిన వెంటనే విపక్ష కూటమి పేరు మార్చుతున్నట్టు ప్రకటించారు. ఈ మీటింగ్ జరగక ముందు నుంచే UPA పేరు మారిపోతుందని సమాచారం అందింది. దీనిపై పలువురు నేతల్ని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. భేటీ ముగిసిన తరవాత అధికారికంగా పేరు మార్చుతున్నట్టు ప్రకటించారు. INDIA అంటే..
I - Indian
N - National
D - Developmental
I - Inclusive
A - Allianceకాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ఒకే ఐడియాలజీ ఉన్న పార్టీలన్నీ ఒక్కటై చివరి వరకూ కలిసే ఉంటారన్న సంకేతాలిచ్చారు. ఇప్పుడు పేరు పెట్టడం పూర్తైంది కాబట్టి...ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టనుంది కూటమి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం...INDIA అనే పేరుని సజెస్ట్ చేసిందెవరు అనేదే. కొంత మంది ఇది రాహుల్ గాంధీ ఐడియానే అని చెప్పినప్పటికీ పలువురు నేతలు మాత్రం దాన్ని కొట్టి పారేశారు. రాహుల్ తరవాత గట్టిగా వినిపిస్తున్న పేరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆమె సూచనతోనే ఈ పేరు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ముందుగా INDIA అంటే Indian National Democratic Inclusive Alliance అని అంతా ఫిక్స్ అయ్యారు. శరద్ పవార్ ఇదే పేరుని కోట్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు. అఖిలేష్ యాదవ్ కూడా ఇదే పేరుతో ట్వీట్ చేశారు. కానీ అంతలోనే మళ్లీ కొత్త పేరు తెరపైకి వచ్చింది. చివరి నిముషంలో Democratic స్థానంలో developmentalని చేర్చారు.
Also Read: Chandigarh Auto driver: టమాటాలు ఉచితంగా పంచుతున్న ఆటో డ్రైవర్, కానీ ఓ కండీషన్