X

Jallikattu: తమిళనాడు జల్లికట్టులో విషాదం.. మదురైలో ఓ వ్యక్తి మృతి..80 మందికిపైగా గాయాలు

తమిళనాడులో జరిగిన జల్లికట్టులో ఓ వ్యక్తి మృతి చెందాడు. కరోనా నిబంధనలు పట్టించుకోకుండా సాగిందీ పోటీ.

FOLLOW US: 

తమిళనాడులోని మదురైలో జరిగిన జల్లికట్టులో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఎనభై మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మదురై జిల్లాలోని అవనియపురంలో నిన్న జల్లికట్టు చాలా ఉత్సాహంగా జరిగింది. వందలమంది ఈ వేడుకలో పాల్గొన్నారు.  అదే సంఖ్యలో క్రీడాకారులు కూడా పాల్గొని ఎద్దులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఒకరు చనిపోగా... పదుల సంఖ్యలో క్రీడాకారులు గాయపడ్డారని తెలుస్తోంది. 

19 ఏళ్ల క్రీడాకారుడు బాలమురగన్ ఎద్దును పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడి మరణించినట్టు సమాచారం. గాయపడిన ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. 

జల్లికట్టులో 150 మందికి మించి పాల్గొనవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కానీ కరోనా ప్రోటోకాల్‌ కాదని... వందల మంది ప్రజలు వేడుక చూసేందుకు గుమ్మిగూడారు. బాలమురగన్‌ కూడా అలాగే వచ్చి పోటీల్లో పాల్గొన్నాడు. 

అవనియపురంలో జల్లికట్టును తమిళనాడు మంత్రులు పళనివేల్‌ థైగ రాజన్, పీ మూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మదురై ఎంపీ వెంకటేషన్‌తోపాటు కలెక్టర్‌ అనీష్‌ శేఖర్ పాల్గొన్నారు. 

మొత్తంగా 652 ఎద్దులు ఈ వేడుకలో ప్రవేశపెట్టారు. ఈ క్రీడలో పాల్గొనేందుకు సుమారు మూడు వందల మంది క్రీడాకారులను అనుమతి ఇచ్చారు. వాళ్లకు కూడా కరోనా నెగటివ్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన వాళ్లనే లోపలికి పంపించారు. 

ఉదయం ప్రారంభమైన వేడుక సాయంత్రం ఐదున్నరకు ముగిసింది. ఎద్దు చాకచక్యంగా లొంగదీసుకున్న కార్తీక్ అనే కుర్రాడిని విజేతగా ప్రకటించారు. ఆయనకు కారును బహుమతిగా ఇచ్చారు. ఇందులో  అత్యుత్తమ ఎద్దు యజమానికి కూడా టూవీలర్‌ను గిఫ్టుగా ఇచ్చారు. 

Also Read: ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు … మరి దక్షిణాయణం ఏంటి…!

Also Read:  శబరిమలలో మకరజ్యోతి దర్శనార్థం వచ్చిన భక్తుల శరణు ఘోష .. 18 పడిమెట్లు వెనుకున్న ఆంతర్యం ఏంటి...

Also Read: శనివారం మకర సంక్రాంతి... మీపై శనిప్రభావం ఉండకూడదనుకుంటే ఇలా చేయండి..

Also Read: బసవన్నగా శివయ్య , హరిదాసుగా శ్రీహరి .. ఆ సంబరమే వేరప్పా…

Also Read: సంక్రాంతి అనగానే మహానగరాల నుంచి పల్లెబాట పడతారెందుకు...
Also Read:  అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read:  మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...
Also Read:  సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Tags: makar sankranti Jallikattu Pongal Jallikattu protest Lohri Madurai jallikattu Avaniyapuram Jallikattu Tamil Nadu Jallikattu Jallikattu death

సంబంధిత కథనాలు

MIM Two CM Posts :  ఒక రాష్ట్రానికి ఒకే సారి ఇద్దరు ముఖ్యమంత్రులు.. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ ! యూపీలో ఓవైసీ పాచిక ఇదే..

MIM Two CM Posts : ఒక రాష్ట్రానికి ఒకే సారి ఇద్దరు ముఖ్యమంత్రులు.. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ ! యూపీలో ఓవైసీ పాచిక ఇదే..

Cryptocurrency crash: 2 రోజుల్లో ఊడ్చుకుపోయిన రూ.12 లక్షల కోట్లు! క్రిప్టో మార్కెట్లో లక్ష కోట్ల డాలర్ల పతనం!!

Cryptocurrency crash: 2 రోజుల్లో ఊడ్చుకుపోయిన రూ.12 లక్షల కోట్లు! క్రిప్టో మార్కెట్లో లక్ష కోట్ల డాలర్ల పతనం!!

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

New Covid Omicron Variant BA.2 : ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !

New Covid Omicron Variant BA.2 :  ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !

Goa Poll 2022: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి జూనియర్ పారికర్.. భాజపాకు బైబై

Goa Poll 2022: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి జూనియర్ పారికర్.. భాజపాకు బైబై
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Union Budget 2022: ఒక్కో మంత్రిది ఒక్కో స్టైల్‌! ఆర్థిక మంత్రుల బ్రీఫ్‌కేస్‌ స్టైల్‌ చూడండి!

Union Budget 2022: ఒక్కో మంత్రిది ఒక్కో స్టైల్‌! ఆర్థిక మంత్రుల బ్రీఫ్‌కేస్‌ స్టైల్‌ చూడండి!

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?