Makar Sankranti 2022: శనివారం మకర సంక్రాంతి... మీపై శనిప్రభావం ఉండకూడదనుకుంటే ఇలా చేయండి..
సూర్యుడు 2022 జనవరి 14 మధ్యాహ్నం దాదాపు రెండున్నర గంటలకు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మనకు సూర్యోదయం ముఖ్యం కాబట్టి మకర సంక్రాంతి జనవరి 15న జరుపుకుంటున్నాం. అయితే ఈ సారి శనివారం కూడా కలసి రావడం విశేషం
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది. మకర రాశికి అధిపతి శని. సూర్యుడి కొడుకు శని. అంటే సూర్యుడు తన దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు తన దిశ మార్చుకున్నప్పుడు శనిదేవుడిని కలిసి దాదాపు నెల రోజుల పాటూ శనితో కలిసే ఉంటాడని పండితులు చెబుతారు. అంటే ఆ నెల రోజులు సూర్యుడి తేజస్సు మందు శనిదేవుడి తేజస్సు మసకబారుతుందన్నమాట. పురాణాల తన ఇంటికి వచ్చిన తండ్రికి నల్ల నువ్వులతో స్వాగతం పలుకుతాడట శని. దీంతో సంతోషించిన సూర్యభగవానుడు ఈ రోజు ఎవరైతే తనకు నల్ల నువ్వులు సమర్పిస్తారో వారికి శని బాధలు తొలగి, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో వర్థిల్లుతారని చెప్పాడట. అందుకే ఏటా మరక సంక్రాంతి రోజు సూర్యుడి పూజలో నల్ల నువ్వులు ఉపయోగిస్తారని చెబుతారు.
Also Read: బసవన్నగా శివయ్య , హరిదాసుగా శ్రీహరి .. ఆ సంబరమే వేరప్పా…
సూర్యుడికి మాత్రమే కాదు శనిదేవుడికి కూడా నల్లనువ్వులు అంటే ప్రీతి అని తెలిసిన విషయమే. ఆయన పూజలో నల్లనువ్వులు ఉపయోగిస్తే శని నుంచి జరగాల్సిన చెడు తగ్గి అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. అందుకే మకర సంక్రాంతి రోజు సూర్యుడితో పాటూ శనికి కూడా నమస్కరించుకుంటే మంచిది. పైగా ఈ ఏడాది సంక్రాంతి శనివారం వచ్చింది కదా..అంతకు మించిన ఫలితాలే పొందుతారని పండితులు చెబతున్నారు.
Also Read: సంక్రాంతి అనగానే మహానగరాల నుంచి పల్లెబాట పడతారెందుకు...
మకర సంక్రాంతి పండుగ కాలం ,ప్రదోషం రెండూ శనివారమే కావడం యాదృచ్ఛికం. శనివారం ప్రదోషం ఉన్నప్పుడు ‘సంక్రాంతి మహాపర్వం’ పడితే దానికి మరింత ప్రాధాన్యత వస్తుంది. ఈ కాలంలో దానధర్మాలు చేయడం, ఉపవాసం చేయడం, మంత్రోచ్ఛారణ చేయడం వల్ల విశేష పుణ్యం కలుగుతుందని చెబుతారు పండితులు. అందుకే మకర సంక్రాంతి నాడు తలస్నానం చేసిన తర్వాత నల్లనువ్వులు కలిపిన నీటిని సూర్య భగవానుడికి సమర్పించాలి. ఆ తర్వాత శని దేవుడిని పూజించండి. పూజలో కూడా వారికి నల్ల నువ్వులను సమర్పించండి. ఆవనూనె, నల్ల నువ్వులు, నువ్వుల లడ్డూను..పూజ పూర్తైన తర్వాత ఎవరికైనా దానం చేయండి. ఇలా చేస్తే సూర్యుడు, శని సంతోషించి మీకున్న దోషాల నుంచి విముక్తి కల్పిస్తారని చెబుతారు...
Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
Also Read: మీ సరదా సరే..దయచేసి భోగి మంటల్లో ఇవి మాత్రం వేయకండి..
Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read: మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...
Also Read: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి