One Nation One Election: వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఒకే దేశం, ఒకే ఎన్నికల చట్టం అమలు - పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు
Simultaneous polls:'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అమలు చేయడానికి ప్రతిపక్షాలు, ఎన్డీయే యేతర పార్టీల సహకారం అవసరం. కోవింద్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు బిల్లును రూపొందించినట్లు సమాచారం.
Parliament winter session 2024: 2029 నాటికి 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (ONOE) లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టవచ్చు. బిల్లును ప్రవేశపెట్టకముందే ప్రతిపక్షాలతో, ముఖ్యంగా కాంగ్రెస్‌తో ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో జమిలి ఎన్నికల పై ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లేదంటే వచ్చే సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కచ్చితంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాతనే దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
రాజ్యాంగ సవరణ అవసరం
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అమలు చేయడానికి, రాజ్యాంగ సవరణ అవసరం, దీనికి ప్రతిపక్షాలు, ఎన్డీయే యేతర పార్టీల సహకారం అవసరం. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు బిల్లును రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బిల్లులపై పార్లమెంటులో చర్చ ప్రారంభం కానుండగా, విస్తృత ఏకాభిప్రాయం కుదిరే వరకు ఓటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది.
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' లక్ష్యం
ఈ ఆలోచన ప్రాథమిక లక్ష్యం వనరులను ఆదా చేయడం, మెరుగైన పరిపాలన, ప్రజాస్వామ్య ప్రక్రియను మెరుగుపరచడం. తరచూ ఎన్నికలు జరగడం వల్ల ఆర్థిక భారం పెరగడమే కాకుండా పాలనలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అందుకే 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది.
Also Read : UPSC Mains Result 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఎన్నికల ఖర్చు తగ్గింపు: ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన ఖర్చులు భారీగా ఆదా అవుతాయి.
పాలనలో కొనసాగింపు : ప్రవర్తనా నియమావళిని పదేపదే అమలు చేయడం విధాన రూపకల్పనపై ప్రభావం చూపుతుంది. 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'తో ఈ అడ్డంకిని తొలగించవచ్చు.
ప్రభుత్వ ఉద్దేశం ఇదే
ఈ విషయంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ప్రతి ఐదేళ్లకోసారి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లేందుకు రామ్ నాథ్ కోవింద్ ప్యానెల్ ఏర్పడింది. ప్యానెల్ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పుడు సంబంధిత బిల్లును పార్లమెంటులో సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఏకకాలంలో ఎన్నికలు
ఏకకాల ఎన్నికలు ఎందుకు అవసరమో వివరించాలని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు. మొదటి ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లులో, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలానికి సంబంధించిన 83,172 అధికరణలను సవరించి, కొత్త ఆర్టికల్ 82A చేర్చబడుతుంది. ఈ సవరణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని కోవింద్ ప్యానెల్ చెబుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయం
స్థానిక సంస్థల ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో అనుసంధానం చేయడానికి, ఆర్టికల్ 325 సవరించనున్నారు. కొత్త ఆర్టికల్ 324A జోడించబడుతుంది. ఈ సవరణకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి.
Also Read : RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !