అన్వేషించండి

New Toll Tax Rules: నేటి నుంచి టోల్ ట్యాక్స్‌లో మార్పులు- వాహనదారులకు ఊరట, తగ్గనున్న టోల్ ఫీజు

NHAI Toll Fee | ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి కానప్పుడు, కొన్నిచోట్ల ఇంకా నిర్మాణం జరుగుతుంటే అక్కడ పూర్తి టోల్‌ వసూలు చేయరు. మిగతా మార్గానికి నేషనల్ హైవే టోల్ ఫీజు తీసుకుంటారు.

న్యూఢిల్లీ: ప్రయాణ సమయంలో రోడ్డు భద్రత, సౌకర్యాల విషయంలో భారత ప్రభుత్వం అనేక కొత్త చర్యలు తీసుకుంటూనే ఉంది. కేంద్రం తాజాగా నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేల (National Highway)పై టోల్ వసూలు నిబంధనలలో మార్పులతో వాహనదారులకు ఊరట కలిగించింది. నేటి నుంచి పలు టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్ తగ్గుతుంది. నేటి (ఫిబ్రవరి 15)  నుండి NHAI కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం, పనులు పూర్తికాని జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై కేవలం అందుబాటులో ఉన్న (ప్రయాణానికి వీలుగా ఉన్న) భాగానికి మాత్రమే టోల్ వసూలు చేయాలి. మొత్తం ఎక్స్‌ప్రెస్‌వే దూరానికి టోల్ వసూలు చేయకూడదు. నిర్మాణంలో మార్గంలో టోల్ ఫీజు సాధారణ నేషనల్ హైవే రేట్ల ప్రకారం ఉంటుంది. 

ఇప్పటి వరకు, ఒక ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా సిద్ధం కాకపోయినా, కొన్ని చోట్ల పనులు జరుగుతున్నప్పటికీ వాహనదారుల వద్ద నుంచి పూర్తి టోల్ వసూలు చేసేవారు. ఈ విధానం సాధారణంగా ప్రయాణీకులపై ఆర్థిక భారాన్ని మోపుతుంది. కొన్ని భాగాలలో నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ పూర్తి టోల్ ఫీజు చెల్లించాల్సి రావడంపై ప్రజలు పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకుని ఒక ముఖ్యమైన మార్పు చేసింది. దీని ప్రకారం, పూర్తిగా అందుబాటులోకి వచ్చి, సిద్ధంగా ఉన్న ఎక్స్‌ప్రెస్ వే లలో మాత్రమే పూర్తి టోల్ ఫీజు వసూలు చేయాలని, లేకపోతే పాక్షికంగా టోల్ ఫీజు వసూలు చేయాలని ఎన్‌హెచ్ఏఐ పేర్కొంది. 

పాత విధానంలో ఎలా చేశారు..
గతంలో ఉన్న విధానంలో ఏదైనా ఎక్స్‌ప్రెస్‌వేలో కొంత భాగం రోడ్డు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, వాహనదారుల నుండి పూర్తిగా టోల్ వసూలు చేసేవారు. ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ధరలు సాధారణ నేషనల్ హైవేస్ కంటే దాదాపు 25 శాతం ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం ఎక్స్‌ప్రెస్‌వేలపై జర్నీ వల్ల ప్రయాణీకులకు వేగవంతమైన, ఎటువంటి అడ్డంకులు లేని ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. వీటిపై ట్రాఫిక్ జామ్ లాంటివి చాలా తక్కువగా ఉంటాయి. రోడ్లు చాలా బాగుండటంతో జర్నీ సాఫీగా సాగిపోతుంది. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. కానీ ఎక్స్‌ప్రెస్‌వే కొంత భాగమే సిద్ధమైనా, వాహనదారుల నుండి పూర్తి టోల్ రేటును వసూలు చేసేవారు. దాంతో అదనపు భారాన్ని భరించాల్సి వచ్చేది.

కొత్త నిబంధనల ప్రకారం 
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఒక ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా సిద్ధం కాకపోతే, దానిపై కేవలం అందుబాటులో ఉన్న భాగానికి మాత్రమే టోల్ వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఆ భాగానికి టోల్ ధర సాధారణ జాతీయ రహదారి ప్రకారం వసూలు చేస్తారు. ఇది ఎక్స్‌ప్రెస్‌వే ధర కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఎక్స్‌ప్రెస్‌వే సగం మాత్రమే సిద్ధంగా ఉంటే, తాము పొందుతున్న సౌకర్యానికి టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ లేదా క్రమం తప్పకుండా ఎక్స్‌ప్రెస్‌వేని ఉపయోగించే ప్రయాణీకులకు ఈ నిర్ణయం ప్రయోజనాన్ని అందిస్తుంది. 

ఈ రూల్ ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది?
ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుంది. ఎక్స్‌ప్రెస్‌వేలు ఎక్కడెక్కడ పాక్షికంగా అందుబాటులో ఉంటాయో అక్కడ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా ఈ అడుగు వేసినట్లు ప్రభుత్వం భావిస్తోంది. 

జీపీఎస్ ఆధారిత టోల్: ప్రభుత్వం త్వరలో 'శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు' వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం చూస్తోంది. దీనివల్ల మీరు రోడ్డుపై ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారో దానికి మాత్రమే టోల్ కట్ అవుతుంది. కొత్త నిబంధనలు వర్తించినా, టోల్ చెల్లింపులు యధావిధిగా ఫాస్టాగ్ ద్వారానే జరుగుతాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget