ఇది మోదీ వాషింగ్ పౌడర్, క్షణాల్లో మరకలు వదిలిపోతాయ్ - బీజేపీపై కాంగ్రెస్ సెటైర్లు
Maharashtra NCP Crisis: బీజేపీ వాషింగ్ మెషీన్ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో సెటైర్లతో విమర్శలు చేస్తోంది.
Maharashtra NCP Crisis:
బీజేపీ వాషింగ్ మెషీన్..
మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలకు బీజేపీయే కారణమని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది. రెండ్రోజుల క్రితమే ప్రధాని మోదీ NCP ఓ అవినీతి పార్టీ అని చెప్పి...ఆ పార్టీ నేతలనే ప్రభుత్వంలోకి చేర్చుకున్నారని మండి పడుతోంది. ఇప్పుడు ఆ విమర్శల డోస్‌ని పెంచింది. ఈ సారి చాలా సెటైరికల్‌గా సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టింది. బీజేపీని "వాషింగ్ మెషీన్" అంటూ ప్రచారం చేస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని డిటర్జెంట్‌లుగా వాడుకుంటోందని వరుస పోస్ట్‌లతో విరుచుకు పడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విటర్‌లో ఈ పోస్ట్‌లు చేశారు.
"ముంబయిలో మరోసారి BJP వాషింగ్ మిషన్ ఆన్ అయింది. అందులో ICE (Incometax, CBI, ED) డిటర్జెంట్‌లు వేశారు. ఇది మోదీ వాషింగ్ పౌడర్. క్షణాల్లోనే అన్ని మరకలూ వదిలిపోతాయి. ప్రతిపక్షాల్లో చీలికలు తీసుకురావాలని కుట్రలు చేస్తున్నారు. జులై 17,18 వ తేదీల్లో కాంగ్రెస్ నేతృత్వంలో మరోసారి విపక్షాలు సమావేశం కానున్నాయి. బీజేపీ చేపట్టే ఆపరేషన్‌లన్నీ విపక్షాలను మరింత బలోపేతం చేసేవే"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత
Yesterday when the BJP Washing Machine restarted in Mumbai with its ICE (Incometax, CBI, ED) detergent, BJP-inspired obituaries on Opposition unity were being planted. The obit writers will be disappointed. The next meeting of the parties that met at Patna on June 23rd will be… pic.twitter.com/LqdwRSg7CO
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 3, 2023
అంతకు ముందు మార్చి నెలలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదే తరహాలో బీజేపీపై సెటైర్లు వేశారు. బీజేపీని వాషింగ్ మెషీన్‌తో పోల్చారు. నల్ల దుస్తులు అందులో వేసి పక్క నుంచి తెల్లటి దుస్తులు తీశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లెవరైనా బీజేపీలో చేరితే వారిపై ఉన్న కేసులన్నీ పోయి క్లీన్‌గా మారిపోతారని ఇలా సింబాలిక్‌గా చూపించారు మమతా బెనర్జీ.
Washing Machine BJP...
— Clyde Crasto - क्लाईड क्रास्टो (@Clyde_Crasto) March 30, 2023
Mamata Banerjee didi demonstrating the Magic of #BJP washing machine that cleans the tainted...the minute they join them. pic.twitter.com/9P68Co3feA
గత వారమే ఢిల్లీ అజిత్ పవార్‌తో పాటు ఏక్నాథ్ శిందేతోనూ భేటీ అయ్యారు షా. అయితే..ఇప్పటి వరకూ బీజేపీ నేతలు దీనిపై కామెంట్ చేయలేదు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందేంటంటే..ఇదంతా రాహుల్‌కి కౌంటర్ ఇచ్చేందుకేనట. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. పైగా...ప్రతిపక్ష నేతగానూ ఆయననే ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. అందుకే...ఆ పార్టీని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో NCPని బీజేపీ టార్గెట్ చేసినట్టు సమాచారం. కూటమిలోని ప్రధాన పార్టీలను పక్కకు తప్పిస్తే కాంగ్రెస్ బలం తగ్గిపోతుందని BJP భావించినట్టు తెలుస్తోంది. ఇది ఊహించని మలుపు అందరూ అనుకుంటున్నప్పటికీ...దాదాపు ఏడాదిగా సీక్రెట్‌గా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
Also Read: Viral Video: కేదార్నాథ్ ఆలయంలో లవ్ ప్రపోజల్, యువతిపై భక్తుల ఆగ్రహం - వైరల్ వీడియో