Viral Video: కేదార్‌నాథ్ ఆలయంలో లవ్ ప్రపోజల్, యువతిపై భక్తుల ఆగ్రహం - వైరల్ వీడియో
Viral Video: కేదార్‌నాథ్ ఆలయంలో ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
Viral Video:
లవ్ ప్రపోజల్...
కేదార్‌నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అత్యంత నిష్ఠగా యాత్రను పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటారు. ఎంతో పవిత్రంగా భావించే ఈ ఆలయ ప్రాంగణంలో ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. బాయ్‌ఫ్రెండ్‌ని సర్‌ప్రైజ్ చేయడం తప్పేం కాదు. కానీ...దానికంటూ ఓ ప్లేస్, టైమ్ ఉంటుందని నెటిజన్లు మండి పడుతున్నారు. అయితే..కొందరు ఇది పాత వీడియో అని...కొందరు కావాలనే రీషేర్ చేస్తున్నారని అంటున్నారు. బాయ్‌ఫ్రెండ్ పక్కనే నిలబడ్డ అమ్మాయి..సైలెంట్‌గా తన చేతుల్లోకి రింగ్‌ని తీసుకుంది. మోకాళ్లపై నిలుచుని ప్రపోజ్ చేసింది. ఆ తరవాత రింగ్ తొడిగింది. ఆ తరవాత ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఓ వ్లాగర్ ఈ వీడియో షూట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే..దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎంత క్యూట్‌గా ప్రపోజ్ చేసిందో అని కొందరు కామెంట్ చేస్తుంటే..మరి కొందరు మాత్రం ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఏంటీ పిచ్చి పనులు అని తిట్టి పోస్తున్నారు.
One of the Reasons why Smartphones should be Banned from All Leading Temples & Shrines
— Ravisutanjani (@Ravisutanjani) July 1, 2023
Just a Basic Phone within 20 KMs from the Main Temple, Eliminates Unnecessary Crowd
PS - I’m writing this from Kedarnath 🛕
pic.twitter.com/FQVxMAUEFm
స్పందించిన ఆలయ కమిటీ..
ఈ వీడియో వైరల్ అవడం వల్ల బద్రినాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ అజేంద్ర అజయ్ స్పందించారు. పుణ్యక్షేత్రాల్లో కొన్ని నిబంధనలు ఉంటాయని, అందుకు తగ్గట్టుగానే ప్రవర్తించాలని హెచ్చరించారు. అందరి విశ్వాసాలను గౌరవించి మర్యాదగా నడుచుకుంటే మంచిదని తేల్చిచెప్పారు. ఆలయం లోపల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడమే తమ బాధ్యత అని, ఈ ఘటన ఆలయం బయట జరిగిందని వివరించారు. ఏదేమైనా దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని వెల్లడించారు. అంతకు ముందు ఓ మహిళ కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరిన వీడియో వైరల్ అయింది. ఫలితంగా...అక్కడ నిఘా లేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
One hundred percent agreement with you sir It's a typical nonsense in such a holey place
— John Doe (@Radhe_l_Radhe) July 2, 2023
As far as they are not being obscene, it should be fine & this is so beautiful! They are not doing anything inappropriate here. Giving commitment of life to each other in front of the Lord is THE Indian way of marriage. What needs to be revisited is not the smartphone ban but our…
— Ankit Bhuptani 🏳️🌈 (@CitizenAnkit) July 2, 2023
Also Read: బాబోయ్ 50 గ్రాముల పాప్‌కార్న్ రూ.460 అట, ఆ డబ్బులతో OTT సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు - వైరల్ పోస్ట్