అన్వేషించండి

Aryan Khan Case: షారుఖ్ ఖాన్ నుంచి లంచం డిమాండ్! సమీర్ వాంఖడేకు మరోసారి సీబీఐ నోటీసులు

CBI summons Sameer Wankhede: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ముంబై ఎన్‌సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.

CBI summons Sameer Wankhede: ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ముంబై ఎన్‌సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు మాజీ యాంటీ డ్రగ్స్ ఆఫీసర్ సమీర్ వాంఖడేను మే 24న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది. ఈ విషయంపై సీబీఐ ఇదివరకే రెండు పర్యాయాలు సమీర్ వాంఖడేను విచారించగా.. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది.

ముంబైలో క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ లభించిన కేసులో ఆర్యన్ ఖాన్ ను మాజీ యాంటీ డ్రగ్ అధికారి సమీర్ వాంఖడే అరెస్టు చేశారు. అనంతరం విచారణ చేపట్టిన సమీర్ వాంఖడే నటుడు షారుఖ్ ఖాన్ ను పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆర్యన్ ఖాన్ నుంచి కేసు నుంచి తప్పించేందుకు మాజీ యాంటీ డ్రగ్ అధికారి సమీర్ వాంఖడే నటుడు షారుఖ్ ను నగదు డిమాండ్ చేశారని అభియోగాలు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఆయన అవినీతికి పాల్పడినట్లు నిర్దారణకు వచ్చిన అత్యుతన్నత దర్యాప్తు సంస్థ, సమీర్ వాంఖేడ్ పై కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 7A, 12,  ఐపీసీలోని సెక్షన్లు 120B, 388 కింద కేసు నమోదైంది. సమీర్ వాంఖడేతో పాటు మరో ఇద్దరు అధికారుల మీద కూడా కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ, ముంబై, రాంచీ, లక్నో, గువహటి, చెన్నై సహా 30 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు.

షారుఖ్ నుంచి కోట్ల రూపాయలు లంచం డిమాండ్!
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు కాగానే, అతడి తండ్రి షారుఖ్ ఖాన్ కు సమీర్ విషయం చెప్పారు. రూ. 25 కోట్లు లంచం ఇస్తే కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను తప్పిస్తానని, లేకపోతే మీ కుమారుడు ఈ కేసు నుంచి బయటపడటం కష్టమేనని చెప్పినట్లు సమాచారం. సీబీఐ ప్రాథమిక విచారణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తో పాటు అతడి స్నేహితుడు అర్బాజ్ మర్చంట్  పేర్లను చివర్లో చేర్చినట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే ముడుపులు తీసుకుని కీలక నిందితులను సమీర్ వాంఖడే విడిచిపెట్టారన్న అభియోగాలతో పాటు ఆర్యన్ ఖాన్ ను కేసు నుంచి తప్పించేందుకు షారుఖ్ ఖాన్ ను కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలతో ఇదివరకే సీబీఐ రెండు పర్యాయాలు సమీర్ ను విచారించింది. మే 24న మరోసారి తమ ఎదుట విచారణకు హాజరుకావాలని సమీర్ వాంఖడేకు సమన్లు జారీ చేసింది సీబీఐ.  

టాప్ హెడ్ లైన్స్

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
Top 5 Road Trips in India : రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
రాజ్యాంగ దినోత్సవం 2026: మత ప్రచారం చేయవచ్చు, మత మార్పిడి కాదు! ఆర్టికల్ 25 ఇంకా ఏం చెబుతోంది?
రాజ్యాంగ దినోత్సవం 2026: మత ప్రచారం చేయవచ్చు, మత మార్పిడి కాదు! ఆర్టికల్ 25 ఇంకా ఏం చెబుతోంది?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Embed widget