Madhya Pradesh: మరో రైలు ప్రమాదం, అదుపు తప్పి కింద పడిపోయిన గూడ్స్ వ్యాగన్‌లు
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది.
Goods derail in Jabalpur:
జబల్‌పూర్‌లో ఘటన..
మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో LPG లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ వ్యాగన్‌లు అదుపు తప్పాయి. రెండు వ్యాగన్‌లు కిందపడిపోయాయి. అన్‌లోడింగ్ చేసే సమయంలో వ్యాగన్‌లు కింద పడిపోయినట్టు అధికారులు వెల్లడించారు.
"రాత్రి పూట లోడ్ వచ్చింది. అన్‌లోడ్ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి రెండు వ్యాగన్‌లు అదుపు తప్పి కింద పడిపోయాయి. ఈ ఘటనతో ఇతర రైళ్లకు ఎలాంటి అంతరాయం కలగలేదు. ఉదయం కాగానే అంతా క్లియర్ చేశాం. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. భారత్ పెట్రోలియం మెయిన్ గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది"
- అధికారులు
Shahpura Bhitoni, Jabalpur, Madhya Pradesh | Two wagons of LPG rake of a goods train derailed while being placed for unloading last night. No main line movement of trains affected. Train movement is normal in main line. Restoration work started after sunrise in the presence of…
— ANI (@ANI) June 7, 2023
#WATCH | Two wagons of LPG rake of a goods train derailed while being placed for unloading last night in Shahpura Bhitoni, Jabalpur of Madhya Pradesh. Train movement is normal in main line. Restoration work started after sunrise in the presence of siding authorities. Fitness… pic.twitter.com/F2StcFHDFi
— ANI (@ANI) June 7, 2023
ఇటీవలే ఒడిశా రైలు ప్రమాదంతో దేశమంతా ఉలిక్కి పడింది. అప్పటి నుంచి ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా సంచలనమవుతోంది. అదే రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరిగింది. బార్‌గర్ జిల్లాలో ఓ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఐదు బోగీలు ట్రాక్ తప్పి కింద పడిపోయాయి. డుంగురి నుంచి బార్‌గర్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. అయితే...ఈ ప్రమాదంపై ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పందించింది. ఈ ఘటనతో రైల్వేకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఓ ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన గూడ్స్ ట్రైన్ ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే అదుపు తప్పి పడిపోయిందని స్పష్టం చేసింది.
#WATCH | Some wagons of a goods train operated by a private cement factory derailed inside the factory premises near Mendhapali of Bargarh district in Odisha. There is no role of Railways in this matter: East Coast Railway pic.twitter.com/x6pJ3H9DRC
— ANI (@ANI) June 5, 2023
Also Read: Odisha train accident: ప్రమాదానికి కారణం సిగ్నల్ ఫెయిల్యూర్ కాదు, లూప్లైన్లోకి వెళ్లడమే మిస్టరీ - సీనియర్ అధికారి