అన్వేషించండి

Gas Cylinder Price: అక్కడ రూ.450 కే గ్యాస్ సిలిండర్, అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ప్రభుత్వం

Gas Cylinder Price: శ్రావణ మాసంలో రూ.450కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

Gas Cylinder Price: 

మధ్యప్రదేశ్‌లో వరాలు..

మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ మీటింగ్ తరవాత రాష్ట్ర ప్రజలకు ఊరటనిస్తూ ఓ ప్రకటన చేసింది. రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కేబినెట్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. అందులో అత్యంత ముఖ్యమైంది...గ్యాస్ సిలిండర్‌ని తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్‌ని అందించడం. శ్రావణ మాసంలో రూ.450కే గ్యాస్ సిలిండర్‌ని అందించనున్నట్టు నరోత్తమ్ మిశ్రా ప్రకటించారు. ఈ ఏడాది జులై 4 నుంచి ఆగస్టు 31 వరకూ ఇప్పుడున్న ధర చెల్లించి గ్యాస్ సిలిండర్‌లను రీఫిల్ చేసుకున్న వారికి రాయితీ డబ్బుల్ని నేరుగా అకౌంట్‌లోకే పంపుతామని స్పష్టం చేశారు. 

"మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. వాటిలో గ్యాస్ ధరను తక్కువ ధరకే అందించాలనీ నిర్ణయించుకున్నాం. శ్రావణ మాసంలో రూ.450కే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ని అందిస్తాం. ప్రస్తుత ధరతో ఇప్పటికే రీఫిల్ చేసుకున్న వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తాం. జులై 4 నుంచి ఆగస్టు 31 వరకూ రీఫిల్ చేసుకున్న వాళ్లకి ఈ ఆఫర్ వర్తిస్తుంది"

- నరోత్తమ్ మిశ్రా, రాష్ట్ర హోం మంత్రి 

ఆశా వర్కర్‌ల వేతనాల పెంపు..

మంత్రి మండలి సమావేశంలో మరో కీలక నిర్ణయమూ తీసుకుంది శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం. విద్యుత్ బిల్‌లను పెంచాలన్న ప్రతిపాదనను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. జులై 4 నుంచి ఆగస్టు 31 వరకూ ఈ పెంపు వర్తించదని వెల్లడించింది. దీంతో పాటు ఆశా వర్కర్‌లకు ఇచ్చే వేతనాలను రూ.2 వేల నుంచి రూ.6 వేలకు పెంచింది. అంతే కాదు. ఏటా రూ.1000 ఇన్‌క్రిమెంట్ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆశా సూపర్‌వైజర్‌లకు ఇన్సెంటివ్స్‌ని రూ.350 నుంచి రూ.500కి పెంచింది. గరిష్ఠంగా రూ.15 వేల వేతనాలు చెల్లించేందుకూ అంగీకరించింది. ఇక జిల్లాల వారీగా క్రీడాపోటీలనూ నిర్వహించాలని నిర్ణయించింది. 

"జిల్లా, డివిజన్, రాష్ట్ర స్థాయుల్లో క్రీడాపోటీలను నిర్వహించాలని నిర్ణయించాం. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2  వరకూ ఈ పోటీలు నిర్వహిస్తాం. అందుకోసం బడ్జెట్‌ని కూడా కేటాయించాం. మేధావి విద్యార్థి యోజన కింద విద్యార్థుల తండ్రులకు ఇన్‌కమ్‌ లిమిట్‌ని రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచుతున్నాం. కాయకల్ప్ స్కీమ్ ద్వారా సిటీల్లోని రోడ్‌లను అందంగా తీర్చిదిద్దేందుకు రూ.1200 కోట్లు కేటాయిస్తున్నాం"

- నరోత్తమ్ మిశ్రా, రాష్ట్ర హోం మంత్రి 

రూ.200 తగ్గింపు..

కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్ల ధరను రూ.200 తగ్గించింది. ఉజ్వలా పథకం లబ్ధిదారులకు అదనంగా మరో రూ.200 రాయితీ అందిస్తోంది. ఈ ఆర్థిక ఏడాదిలో మిలిగిన ఏడు నెలలూ ప్రభుత్వం గ్యాస్‌ ధరలను పెంచబోదని సమాచారం. దాంతో వినియోగదారులు రూ.18,500 కోట్ల మేర ఆదా చేయబోతున్నారు. ధరలను తగ్గించినప్పటికీ ప్రభుత్వ ఫ్యుయెల్‌ రిటైలర్లు ఒక్కో రీఫిల్‌పై రూ.100కు పైగా లాభం పొందుతారని తెలిసింది. ఒకవేళ నష్టం వస్తే మోదీ సర్కారు భరించడానికి సిద్ధంగా ఉందట.ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రూ.22,100 కోట్ల మేర లాభం ఆర్జించాయి. జనవరి-మార్చి త్రైమాసికం నాటి రూ.20,800 కోట్లతో పోలిస్తే ఇదెంతో ఎక్కువ. ఏడాది కిత్రంనాటి రూ.18,500 కోట్ల నష్టంతో పోలిస్తే అద్భుతమేనని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది.

Also Read: Google AI: ఇండియన్స్‌కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన గూగుల్, AI టూల్‌తో కొత్త సెర్చింగ్ ఫీచర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!ఎద్దుపై పులి దాడి, రెండ్రోజులు అదే ఫుడ్.. వణికిపోతున్న ప్రజలుఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Pawan Kalyan - Rana Daggubati: పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Embed widget