గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పెంచిన కేంద్రం, కేబినెట్ సమావేశంలో నిర్ణయం
LPG Cylinder Subsidy: ఎల్పీజీ సిలిండర్ల సబ్సిడీని రూ.300 వరకూ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
LPG Cylinder Subsidy:
రూ.300 సబ్సిడీ..
ఎల్పీజీ సిలిండర్ల సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న రూ.200 సబ్సిడీని రూ.300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. Pradhan Mantri Ujjwala Yojana స్కీమ్‌లో భాగంగా ఎల్పీడీ సిలిండర్లపై సబ్సిడీ ఇస్తోంది కేంద్రం.
"కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అందులో కోట్లాది మంది మహిళలకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకున్నాం. LPG సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచాలని నిర్ణయించాం"
- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి
The government has raised subsidy amount for Pradhan Mantri Ujjwala Yojana beneficiaries from Rs 200 to Rs 300 per LPG cylinder: Union minister Anurag Thakur during a briefing on Cabinet decisions pic.twitter.com/Dvf7wXtXQT
— ANI (@ANI) October 4, 2023
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY)ని 2016లో ప్రారంభించింది మోదీ సర్కార్. కట్టెల పొయ్యితో వంట చేయడాన్ని తగ్గించి, సిలిండర్లు రాయితీ కింద మహిళలకు అందించాలని ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడినట్టు అవుతుంది. దాంతో పాటు కాలుష్యమూ తగ్గుతుంది. అందుకే సిలిండర్‌పై రాయితీ ఇచ్చి వాళ్లకు అందుబాటు ధరలో ఉంచుతోంది. ఇప్పుడు సబ్సిడీని పెంచడం వల్ల కోట్లాది మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు అనురాగ్ ఠాకూర్. ప్రస్తుతానికి ఉజ్వల లబ్ధిదారులు 14.2 కిలోల సిలిండర్‌కి రూ. 703 చెల్లిస్తున్నారు. మార్కెట్ ధర రూ.903గా ఉంది. ఇప్పుడు సబ్సిడీ పెంపుతో రూ.603 చెల్లిస్తే సరిపోతుంది. వాణిజ్య సిలిండర్ ధరలు మాత్రం పెరుగుతూ పోతుండటం వ్యాపారులను హడలెత్తిస్తోంది. ఇటీవలే భారీగా పెచింది.
కమర్షియల్ సిలిండర్ ధర పెంపు..
19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒక్కసారిగా రూ. 209 పెంచాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ రిటైల్ ధర ఇప్పుడు రూ. 1,731.50కు చేరుకుంది. ఈ పెంపు ఆదివారం (అక్టోబర్ 1) నుంచి అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర గతంలో రూ.1,522.50 ఉండేది. తాజాగా రూ.209 పెంపుతో రూ.1731.50కి చేరింది. దీనిపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఈ పెంపు అధికారికంగా ధృవీకరించబడలేదు. దేశంలో సిలిండర్ల ధరలను పెంచినట్లు ANI తెలిపింది. ఇటీవల కేంద్రం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 200 తగ్గించింది. దీనితో పాటుగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను గత సెప్టెంబర్ 1న రూ. 157 మేర తగ్గించేశాయి. దీంతో వరుసగా మూడో నెలలుగా కమర్షియల్ సిలిండర్ల ధరలను తగ్గించినట్లైంది. దాంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1522 వద్దకు దిగి వచ్చింది. ఇది వరకు ఈ ధర రూ. 1680గా ఉండేది.
Also Read: ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్