అన్వేషించండి

Longest Serving PMs of India: నెహ్రూ రికార్డు బద్దలుకొట్టిన నరేంద్ర మోదీ.. సుదీర్ఘకాలం భారత ప్రధానిగా సేవలందించింది వీరే

భారత తొలి ప్రధాని నెహ్రూ వ్యవసాయం, పారిశ్రామికీకరణకు ప్రాధాన్యం ఇవ్వగా.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురుగా తీర్చిదిద్దేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

నేడు భారత ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. ఎన్నికై సుదీర్ఘకాలం భారత ప్రధానిగా సేవలు అందించిన నేతగా నిలిచారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును 6 దశాబ్దాల తరువాత బద్దలుకొట్టారు. నేటితో జూన్ 8, 2026 నిరంతరాయంగా 12 సంవత్సరాలు ప్రధానిగా పరిపాలనను పూర్తి చేసుకున్నారు. అయితే భారత ప్రధానిగా ఎక్కువ కాలం జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి సేవలు అందించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల వరకు ప్రధానిగా వ్యవహరించిన నెహ్రూ మరణించే వారకు ఆ పదవిలో కొనసాగారు.  

భారత్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన టాప్ 5 ప్రధాన మంత్రులు వీరే.  భారత ప్రజాస్వామ్య చరిత్రలో తమదైన ముద్ర వేసి, దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించిన అగ్ర నేతలు కాంగ్రెస్, ఎన్డీయే, యూపీఏ కూటమి నుంచి ప్రధానులు అయ్యారు. 

1. జవహర్‌లాల్ నెహ్రూ మొత్తం పదవీకాలం: 16 సంవత్సరాల 286 రోజులు (మొత్తం 6,130 రోజులు.
1952 ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా 4,398 రోజులు పాలించారు. ఆగస్టు 15, 1947న స్వతంత్ర భారత తొలి తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మొదట స్వతంత్య్ర భారతావనిలో తొలి ఎన్నికలకు ముందు 1947– 1952 మధ్య కాలంలో ఆయన ప్రధానిగా సేవలు అందించారు. దేశంలో ఎన్నికైన తొలి ప్రధాని నెహ్రూనే. 
ఒకటోసారి పదవీకాలం (1951-52 ఎన్నికలు): దేశంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని అయ్యారు.  1957 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ విజయంతో మూడోసారి సారి ప్రధాని అయ్యారు. 3వ ఎన్నికైన పదవీకాలం 1962 ఎన్నికలు కాగా..  నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మే 27, 1964న పదవిలో ఉన్న సమయంలో కన్నుమూశారు. 

Also Read: PM Modi Breaks Nehru Record: నవభారత చరిత్రలో సరికొత్త మైలురాయి - నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ.. 12 ఏళ్ల అప్రతిహత ప్రస్థానం

2. ఇందిరా గాంధీ మొత్తం పదవీకాలం: 15 సంవత్సరాల 350 రోజులు (రెండు విడతలుగా) ప్రధానిగా సేవలు.
పదవీకాలాలు & ఎన్నికల సంవత్సరాలు: మొదటి విడత 1966 నుంచి 1977 వరకు ప్రధానిగా కొనసాగారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణం తర్వాత ఇందిరాగాంధీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.  1967 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ప్రధానిగా సేవలు అందించారు.  "గరీబీ హటావో" నినాదంతో 1971 ఎన్నికల్లో విజయంతో చారిత్రాత్మక విజయం సాధించారు. ఈ కాలంలోనే ఆమె పాలనపై వ్యతిరేకత రావడంతో దేశంలో ఎమర్జెన్సీ (1975-77) విధించి అప్రతిష్ట మూట కట్టుకున్నారు. రెండో విడతలో 1980– 1984 మధ్య కాలంలో దేశాన్ని పాలించారు. 1980 ఎన్నికల్లో విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చారు. అక్టోబర్ 31, 1984న హత్యకు గురయ్యే వరకు వరకు ప్రధానిగా కొనసాగారు.

3. నరేంద్ర మోదీ మొత్తం పదవీకాలం: 12 సంవత్సరాల 14 రోజులు (ప్రస్తుతం కొనసాగుతున్నారు). 
పదవీకాలం & ఎన్నికల సంవత్సరాలు:  మే 26, 2014న తొలిసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ అందించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సంచలనం సృష్టించారు. జీఎస్టీని అమలు చేశారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి రెండోసారి ప్రధాని అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో జూన్ 9, 2024న ఎన్డీయే (NDA) కూటమి ప్రభుత్వ అధినేతగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి విజయవంతంగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికై సుదీర్ఘంగా ప్రధానిగా సేవలు అందించిన నేతగా నెహ్రూ రికార్డు క్రియేట్ చేశారు. సీఎంగా, పీఎంగా చూసుకుంటే ప్రజల చేత ఎన్నికై ఎక్కువ రోజులు ప్రభుత్వాధినేతగా సేవలు అందించిన జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నారు. 

 4. మన్మోహన్ సింగ్ మొత్తం పదవీకాలం: 10 సంవత్సరాల 4 రోజులు.
అత్యధిక కాలం ప్రధానిగా చేసిన జాబితాలో మన్మోహన్ సింగ్ నాలుగో స్థానంలో ఉన్నారు. విజయవంతంగా రెండు టర్మ్స్ పూర్తి చేసుకున్న నెహ్రూ, గాంధీయేతర ఫ్యామిలీకి చెందిన తొలి నేతగా రికార్డు నెలకొల్పారు. 2004 ఎన్నికల్లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA-1) కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. సోనియా గాంధీ పట్ల సీనియర్ నేతలు అనాసక్తిగా ఉండటంతో ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. 2009 ఎన్నికల్లో యూపీఏ కూటమి రెండోసారి విజయవం సాధించగా మరోసారి ప్రధాని అయ్యారు. మే 26, 2014 వరకు పదేళ్ల పాటు ఆర్థిక సంస్కరణల దిశగా దేశాన్ని నడిపించారు.

Also Read: PM Modi 12 Years Achievements:సామాన్యుడి చేతిలో బ్యాంక్ బుక్... దేశం చేతిలో సెమీకండక్టర్ చిప్‌! ఎన్నికై ఎక్కువ కాలం పాలించిన ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీపై స్పెషల్ స్టోరీ!

5. అటల్ బిహారీ వాజ్‌పేయీ మొత్తం పదవీకాలం: 6 సంవత్సరాల 80 రోజులు (మూడు విడతలుగా కలిపి). 
మొదటి విడత 1996 ఎన్నికల్లో తొలిసారి ప్రధాని అయ్యారు. మే 1996లో కేవలం 13 రోజుల పాటు అత్యల్ప కాలం ప్రధానిగా కొనసాగారు. 1998 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయంతో మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినా, కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో 13 నెలలకే ఈ ప్రభుత్వం కూలిపోయింది.  కార్గిల్ యుద్ధం అనంతరం జరిగిన 1999 ఎన్నికల్లో విజయం సాధించి, పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని (1999-2004) పూర్తి చేశారు. ఆ సమయంలో పూర్తి 5 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా వాజ్‌పేయీ రికార్డు సృష్టించారు. ఈయన హయంలోనే అబ్దుల్ కలాం రెండోసారి అణు పరీక్షల్లో భారత్ విజయం సాధించి సత్తా చాటింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
Advertisement

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget