BJP News: బీజేపీలో చేరిన మాజీ సీఎం కుమార్తె - షాక్‌లో పార్టీ నేతలు
Kerala News: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే అంటోని తనయుడు బీజేపీలో చేరితే...తాజాగా మారో మాజీ ముఖ్యమంత్రి కూతురు పద్మజా వేణుగోపాల్ కమలం గూటికి చేరారు.
Kerala Congress News: కేరళ (Kerala)లో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి ఏకే అంటోని తనయుడు అనిల్ అంటోని (Anil Antony) బీజేపీ (Bjp)లో చేరితే...తాజాగా మారో మాజీ ముఖ్యమంత్రి కూతురు పద్మజా వేణుగోపాల్ (Padmaja Venugopal) కమలం గూటికి చేరిపోయారు. పద్మజా వేణుగోపాల్...కేరళ మాజీ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్ కుమార్తె. గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన ఆమె...దిల్లీలో కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ సమక్షంలో పద్మజా వేణుగోపాల్...బీజేపీ కండువా కప్పుకొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పద్మజా వేణుగోపాల్....త్రిసూర్ డీసీసీ అధ్యక్షురాలిగా పని చేశారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, తాజప్పయ ఎంప్లాయీస్ యూనియన్, టెక్నికల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యురాలుగానూ పని చేశారు. పద్మజా వేణుగోపాల్...బీజేపీలో చేరడంపై సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ మురళీధరన్ స్పందించారు. ఆమె బీజేపీలో చేరినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. తన తండ్రి మత రాజకీయాల విషయంలో ఎన్నడూ రాజీ పడలేదన్న ఆయన, తన కుటుంబానికి చెందిన వ్యక్తి బీజేపీలో చేరడం విచారకరమన్నారు.