IT Raids: సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసినట్టు ఆధారాలున్నాయి.. ఐటీ అధికారులు
నటుడు సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఐటీ దాడుల్లో ఆధారాలు లభించాయని అధికారులు చెప్పారు.
![IT Raids: సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసినట్టు ఆధారాలున్నాయి.. ఐటీ అధికారులు IT Raids Actor Sonu Sood aides evaded tax worth over RS.20 crores says income tax department IT Raids: సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసినట్టు ఆధారాలున్నాయి.. ఐటీ అధికారులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/15/cdc9eb0fc4d86c20b192356d2dbe4f96_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సోనూసూద్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేసింది. వరుసగా మూడో రోజులపాటు ఆయన నివాసం, తదితర ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు. సోనూసూద్ పన్ను ఎగవేసినట్లు ఆధారాలు లభించాయని ఐటీ అధికారులు చెబుతున్నారు. విదేశీ నిధులను తీసుకోవడంలో 'విదేశీ విరాళాల నియంత్రణ చట్టం' నిబంధనలు ఉల్లంఘించినట్లు కూడా వెల్లడించారు.
The total amount of tax evaded unearthed so far, amounts to more than Rs 20 crore: Central Board of Direct Taxes (CBDT)
— ANI (@ANI) September 18, 2021
ఐటీ అధికారులు సోనూసూద్ ఇళ్లు, అతడికి సంబంధించిన వ్యక్తుల నివాసాల్లో తనిఖీలు చేసినప్పుడు పన్ను ఎగవేసినట్లు గుర్తించామని చెబుతున్నారు అధికారులు. ముంబయి, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గురుగ్రామ్ సహా 28 ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. బుధవారం సోనూపై ఐడీ శాఖ తనిఖీలు చేయడం మెుదలుపెట్టింది. తరువాత అతడితో సంబంధం ఉన్న వ్యక్తులపై ఐటీ దాడులు జరిగాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన పార్టీలు సోనూసూద్ పై ఐడీ దాడుల చేయడాన్ని ఖండించాయి. కేంద్రంపై విమర్శలు చేశాయి. కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సేవ చేసిన సోనూసూద్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని ఆరోపించారు.
ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిశాడు సోనూసూద్. ఢీల్లి ప్రభుత్వం ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అయితే ఈ క్రమంలో సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పుకార్లు వచ్చాయి. అంతకు ముందు ఏకంగా ముంబయి మేయర్‌గా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దింపుతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే, వాటన్నిటిపై స్పందించేందుకు సోనూసూద్ నిరాకరించాడు.
కరోనా సమయంలోనే కాదు. 2020 ఏప్రిల్ తర్వాత నుంచి సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు దేశం మొత్తం ఫిదా అయిపోయింది. తాము కష్టాల్లో ఉన్నామంటూ ట్వీట్లు చేసిన ఎందరికో సాయంచేశాడు. కొందరికి లక్షలు ఖర్చు పెట్టి ట్రాక్టర్లు కొనిచ్చాడు. వేలాది రూపాయలతో పిల్లలు చదువుకోవడానికి సెల్ ఫోన్లు కొనిచ్చాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సోనూ సూద్ చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. ఏపీలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయించాడు. చాలా మందికి ఆర్థికంగా సాయం చేశాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)