News
News
X

Supreme Collegium: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త సీజేలు.. సిఫారసు చేసిన సుప్రీం కోర్టు కొలీజియం

త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త సీజేఐలు రానున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.

FOLLOW US: 

సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి, ఐదుగురు సీజేఐల బదిలీలను ప్రదిపాదిస్తూ కేంద్రానికి సిఫార్సు చేసింది. సిఫార్సుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రస్తుతం కర్ణాటక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ పేరును సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదన చేసింది. వివిధ అవసరాల దృష్ట్యా ఒకేసారి 25 మంది న్యాయమూర్తుల బదిలీకి ఆమోదం తెలిపింది. మొత్తం 41 మందికి స్థాన చలనం కలగనుంది. ఈ సిఫారుసుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. తెలంగాణ నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో న్యాయమూర్తి బదిలీ అవుతారు.  ఆంధప్రదేశ్‌ నుంచి ప్రధాన న్యాయమూర్తి బదిలీ కాగా, అక్కడికి మరో ప్రధాన న్యాయమూర్తితో పాటు, కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు వస్తారు.

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అవుతారు. ఆంధ్రప్రదేశ్‌ సీజే జస్టిస్‌ అరూప్‌ గోస్వామిని ఛత్తీస్‌గఢ్‌ పంపాలని కొలీజియం ప్రతిపాదించింది. ఏపీ హైకోర్టుకు పట్నా నుంచి జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ నుంచి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీలను బదిలీ చేయాలని సిఫార్సు చేశారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే అవకాశం ఉన్న జస్టిస్‌ సతీష్‌.. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అవుతారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 

Also Read: KRM GRMB Meet: కృష్ణా, గోదావరి బోర్డుల ఉపసంఘాల భేటీ... ప్రాజెక్టుల వివరాలు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం

Also Read: AP LAWCET 2021: ఏపీ లాసెట్ హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Also Read: Miss Universe Singapore 2021: సిక్కోలు చిన్నదానికి సింగపూర్ అందాల కిరీటం.. నెక్ట్స్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా

Also Read: Jogi Ramesh : అయ్యన్న వ్యాఖ్యలపై జోగి రమేష్ ఒక్కరే ఎందుకు స్పందించారు ? వ్యూహమా ? రాజకీయమా ?

Published at : 18 Sep 2021 12:46 PM (IST) Tags: ap high court Telangana High Court Supreme Court Collegium new cji's to telugu states justice sathish chandra justice prashanth

సంబంధిత కథనాలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

నేను జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు, నచ్చక రాజీనామా చేస్తున్నా - వెనక్కి తగ్గను: యార్లగడ్డ

నేను జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు, నచ్చక రాజీనామా చేస్తున్నా - వెనక్కి తగ్గను: యార్లగడ్డ

AP SC Welfare: ఏపీలో ఎస్సీల సంక్షేమానికి కేంద్రం రూ.2,837 కోట్లు - శాఖల వారీగా కేటాయింపుల వివరాలు

AP SC Welfare: ఏపీలో ఎస్సీల సంక్షేమానికి కేంద్రం రూ.2,837 కోట్లు - శాఖల వారీగా కేటాయింపుల వివరాలు

Rains In AP Telangana: మరో ఐదు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Rains In AP Telangana: మరో ఐదు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Supreme Court On AP Govt : లాయర్లకు ఫీజుల చెల్లింపులో ఉన్న శ్రద్ధ పర్యావరణ రక్షణపై లేదా?, ఏపీ సర్కార్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court On AP Govt : లాయర్లకు ఫీజుల చెల్లింపులో ఉన్న శ్రద్ధ పర్యావరణ రక్షణపై లేదా?, ఏపీ సర్కార్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

Balakrishna In Action Mode : కత్తి పట్టిన బాలకృష్ణ - విదేశాల్లో ఊచకోత

Balakrishna In Action Mode : కత్తి పట్టిన బాలకృష్ణ - విదేశాల్లో ఊచకోత

ధావన్ కు త్వరగా పెళ్లి చేయాలన్న జడేజా- నెట్టింట్లో వీడియో వైరల్

ధావన్ కు త్వరగా పెళ్లి చేయాలన్న జడేజా- నెట్టింట్లో వీడియో వైరల్

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు