(Source: ECI/ABP News/ABP Majha)
Brahmos Land Attack: ఐఎన్ఎస్ చెన్నై నుంచి బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన నౌకాదళం
Brahmos Land Attack: భారత నౌకాదళం ఐఎన్ఎస్ చెన్నై నుంచి క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ విజయవంతంగా పరీక్షించింది. ఐఎన్ఎస్ చెన్నై, బ్రహ్మోస్ రెండూ స్వదేశంలో అభివృద్ధి చేసినవే అని నౌకదళ వర్గాలు తెలిపాయి.
Brahmos Land Attack:భారత నౌకాదళం బ్రహ్మోస్(Brahmos) సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. శనివారం స్టెల్త్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై(INS Chennai) నుంచి క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించింది. నీటిపై నుంచి భూమి పైన లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోగల క్షిపణి ప్రయోగం విజయవంతమైందని భారత నావికాదళం పేర్కొంది. ఈ క్షిపణి విస్తృత శ్రేణి రెంజ్ దాటి కచ్చితమైన లక్ష్యాన్ని చేధించిందని పేర్కొంది. బ్రహ్మోస్ క్షిపణి, INS చెన్నై రెండూ దేశీయంగా రూపొందించినవే. ఆత్మ నిర్భర్ భారత్(Atma Nirbhar Bharat), మేక్ ఇన్ ఇండియాతో భారత నౌకాదళం స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తుందని పేర్కొంది. ఈ ప్రయోగం భారత నావికాదళ సామర్థ్యాన్ని మరింత పెంచిందని నౌకాదళ వర్గాలు తెలిపాయి. అవసరమైనప్పుడు, అవసరమైన చోట సముద్రం నుంచి భూఉపరితలంపై దాడి చేయదలదని పేర్కొన్నాయి.
Long range precision strike capability of Adv version of #BrahMos missile successfully validated.
— SpokespersonNavy (@indiannavy) March 5, 2022
Pin point destruction of tgt demonstrated combat & mission readiness of frontline platforms.
Yet another shot in the arm for #AatmaNirbharBharat#IndianNavy #CombatReady & #Credible pic.twitter.com/NKl3GoHwbB
ఇదొక మైలురాయి
భారత నౌకాదళం అధునాతన క్షిపణి బ్రహ్మోస్ శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ పరీక్ష సమయంలో క్షిపణి కచ్చితమైన లక్ష్యాన్ని చేధించింది. బ్రహ్మోస్ క్షిపణికి ఇది ఆధునిక వెర్షన్ అని నౌకాదళం ప్రకటించింది. అందులో పలు అప్‌డేట్‌లు చేశామన్నారు. ఈ పరీక్ష స్వావలంబన భారత మిషన్ విజయానికి మైలురాయిగా నిలుస్తోందని పేర్కొంది. సముద్రం నుంచి దూరంగా భూమిపై ఉన్న లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యాన్ని ఈ పరీక్షల ద్వారా తెలుసుకున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. ఐఎన్‌ఎస్ చెన్నై యుద్ధ నౌక నుంచి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించారు. భారతీయ క్షిపణి అభివృద్ధి, నౌకా నిర్మాణ సామర్థ్యానికి ఇది ప్రతీకలని నేవీ చెప్పింది. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాతో ఇది సాధ్యమైందని చెప్పింది.
అత్యంత శక్తివంతమైన క్షిపణి బ్రహ్మోస్
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటైన బ్రహ్మోస్‌ను భారత నావికాదళం క్రమం తప్పకుండా పరీక్షిస్తుంది. భారతదేశం నవంబర్ 2020లో అండమాన్ నికోబార్ దీవుల నుంచి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ల్యాండ్-ఎటాక్ వెర్షన్‌ను పరీక్షించింది. ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్‌లో సూపర్‌సోనిక్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సుఖోయ్ 30 ఎంకే-ఐ ద్వారా బ్రహ్మోస్ క్షిపణి ఎయిర్ వెర్షన్‌ను పరీక్షించారు. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. దేశంలోనే బ్రహ్మోస్ క్షిపణుల ఎయిర్ వెర్షన్ అభివృద్ధి చేస్తున్నారు.
Also Read: Defence Expo 2022: డిఫెన్స్ ఎక్స్‌పో 2022 వాయిదా- కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే?