అన్వేషించండి

Monkeypox Cases: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు, మంకీపాక్స్‌పై అప్రమత్తమైన కేంద్రం - హైలెవల్ మీటింగ్

India about Monkeypox | దేశంలో ఇప్పటివరకూ మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని, అయితే Mpox భారీగా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి.

Monkeypox News | న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ (Monkeypox)పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికల కారణంగా భారత్ సైతం మంకీపాక్స్‌ వ్యాధిపై అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ డా. పీకే మిశ్రా నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీపాక్స్ (MPox)పై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారత్ లో ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదని, భారీగా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని తాము అంచనా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 

మంకీపాక్స్ ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై హైలెవల్ మీటింగ్‌లో ఉన్నతాధికారులతో డా. పీకే మిశ్రా చర్చించారు. ఎంపాక్స్ వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబులను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మంకీపాక్స్ (MPox) వ్యాప్తిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేయాలని సూచించారు. 

2022లో 116 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 99,176 మందికి మంకీపాక్స్ సోకగా 208 మంది మృతి చెందారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. కాంగో దేశంలో ఈ కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయని.. 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 537 మంది మృతిచెందారు. ఎంపాక్స్ వేగంగా వ్యాపిస్తుందని, దీని కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, సలహాలు, సూచనలు త్వరలోనే విడుదల చేస్తామని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. ఆఫ్రికా దేశాలతో పాటు పాకిస్తాన్, స్వీడన్ సహా మరికొన్ని దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదు కాగా, మరణాల రేటు 2.8 శాతంగా ఉంది. 95 నుంచి 98 శాతం ఎంపాక్స్ కేసులు ఆఫ్రికాలో, ముఖ్యంగా కాంగోలోనే నమోదవుతున్నాయి. 

మొదటి కేసు నమోదైంది ఎప్పుడంటే..

మంకీపాక్స్ అనేది కరోనా వ్యాప్తి లాంటిది కాదు, కానీ ఇది ఒక వైరల్ ఇన్​ఫెక్షన్. ఇది జంతువులతో పాటు మానవులను సైతం ప్రభావితం చేస్తుంది. ఆర్తోపాక్స్ వైరస్​ జాతికి చెందినదిగా ఎంపాక్స్‌ను గుర్తించారు. ఈ వైరస్ సోకిన వారికి చర్మంపై గడ్డలు, పొక్కులు లాగ వచ్చి,  దురద పెడుతుంది. ఎంపాక్స్‌ను తొలిసారిగా 1958లో కోతులలో గుర్తించారు. కోతులలో తొలిసారి గుర్తించడంతో దీనికి మంకీపాక్స్ అని నామకరణం చేశారు. ఆపై 1970లో ఏడాదిలోపు వయసున్న ఓ బాలుడికి మంకీ ఫాక్స్ వచ్చినట్లు తొలి కేసు నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022లో ఈ మంకీపాక్స్​ను ఎంపాక్స్‌గా నామకరణం చేసింది. 

Also Read: పాకిస్థాన్‌లో తొలి Mpox కేసు నమోదు, ఇండియాకీ ముప్పు పొంచి ఉందా?

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget