Watch Video: అండర్‌పాస్‌లో వరదల్లో చిక్కుకున్న కాలేజ్ బస్, అతి కష్టం మీద బయటపడిన విద్యార్థులు
Watch Video: గుజరాత్‌లో భారీ వానలకు అండర్‌పాస్ జలమయం కాగా ఓ కాలేజ్ బస్ అందులో చిక్కుకుంది.
Watch Video:
గుజరాత్‌లో భారీ వర్షాలు..
గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఖేదా జిల్లాలోని ఓ అండర్‌పాస్‌లో నీళ్లు నిలిచిపోయి ఓ కాలేజ్ బస్ చిక్కుకుంది. చాలా సేపు సాయం కోసం చూసిన ఆ విద్యార్థుల్లో కొందరు ఎలాగోలా బయటకు వచ్చారు. వాళ్లే మిగతా విద్యార్థులకూ సాయం చేసి బస్‌లో నుంచి సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురు అబ్బాయిలు బస్ పక్కన ఓ లేన్‌లో నిలబడి బస్‌లో ఉన్న వారికి చేయందించారు. బయటకు రావడానికి అంతకు మించి మార్గం కనిపించలేదని, కింద నీళ్లు నిలిచిపోవడం వల్ల ఇబ్బంది పడ్డామని స్టూడెంట్స్ చెప్పారు. విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే సాయం చేయాల్సింది పోయి కొందరు బైకర్స్ ఆ సందులో నుంచే వెళ్తూ కనిపించారు. గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని గత వారమే IMD వెల్లడించింది. రాష్ట్రంలోని దహోద్, పంచ్‌మహల్, చోటా ఉదెపూర్, నర్మదా, దంగ్, తపి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సూరత్, వల్సాద్ జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిశాయి. సౌరాష్ట్ర, పోర్‌బందర్, గిర్ సోమనాథ్, జునాగఢ్‌లోనూ ఇవే పరిస్థితులుంటాయని IMD అధికారులు వెల్లడించారు. వానల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రైతులు ఆనందంలో మునిగిపోయారు.
#WATCH | Gujarat: Due to heavy rain in Nadiad area of Kheda district, leading to waterlogging, a college bus got stuck in a bypass. The locals immediately rushed to the spot and rescued all the students on the bus. pic.twitter.com/D61cs00Hu7
— ANI (@ANI) June 24, 2023
బిపార్జాయ్ తుపాను ఎఫెక్ట్‌తో అటు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా...రాజస్థాన్ మాత్రం వర్షాలతో సతమతం అవుతోంది. అంత భారీ వానలోనూ కొందరు తమ డ్యూటీని మాత్రం మర్చిపోవడం లేదు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను కరెక్ట్ టైమ్‌కి డెలివరీ చేస్తున్నారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఓ ఏజెంట్ వర్షాన్ని, వరదని లెక్క చేయకుండా ఓ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేశాడు. ఈ ఏజెంట్ పనిని ఎంతో మెచ్చుకున్నారు హర్దీప్ సింగ్. ఉద్యోగంపై ఇంత డెడికేషన్ ఉండటం గొప్ప విషయం అంటూ కితాబునిచ్చారు. రాజస్థాన్‌లోని బర్మేర్‌లో ధోక్ గ్రామంలో ఈ ఏజెంట్ ఇలా వరదలో కష్టపడుతూనే గ్యాస్ డెలివరీ చేశాడు.
"ప్రతి ఒక్కరికీ ఎల్పీజీ అందుబాటులో ఉంటుందని భరోసా ఇస్తున్నాం. డ్యూటీ పట్ల ఎంతో డెడికేషన్ ఉన్న ఈ సైనికుడు బిపార్జాయ్ తుపాను ప్రభావాన్నీ లెక్క చేయలేదు. ఇండేన్ గ్యాస్‌ని రీఫిల్‌ని సప్లై చేసేందుకు ఇలా సాహసం చేశాడు.
- హర్దీప్ సింగ్ పురి, కేంద్రమంత్రి
चूल्हा जलता रहेगा
— Hardeep Singh Puri (@HardeepSPuri) June 17, 2023
देश बढ़ता रहेगा
Ensuring energy availability.
With commendable dedication towards duty, this undaunted foot soldier of India’s energy sector braves the impact of #Biparjoy to supply an #Indane refill at a consumer’s home in village Dhok in Barmer, Rajasthan. pic.twitter.com/TpOIbN942v
Also Read: ప్రధాని మోదీకి టీషర్ట్ గిఫ్ట్‌గా ఇచ్చిన బైడెన్, దానిపై ఇంట్రెస్టింగ్ కొటేషన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial