G7 Summit: భారత కళా నైపుణ్యాన్ని చాటి చెప్పిన మోదీ- జీ7 దేశాధినేతలకు అరుదైన బహుమతులు
G7 Summit: జీ7 దేశాధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన బహుమతులను అందజేశారు.
G7 Summit: అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడాలతో కూడిన జీ7 కూటమి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. భారతీయుల కళా నైపుణ్యాన్ని వారికి చాటిచెప్పారు. జీ7 దేశాధినేతలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా తయారు చేసిన వస్తువులను బహుమతిగా ఇచ్చారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో అమలు చేస్తోన్న 'ఒక జిల్లా-ఒక ఉత్పత్తి' పథకంలో ఈ బహుమతులను తయారు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కళాకారుల పనితనానికి గుర్తింపు లభించే విధంగా ఈ బహుమతులను తీర్చిదిద్దారు.
బైడెన్‌కు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు గులాబీ మీనాకరి బ్రోచ్‌ను ప్రధాని మోదీ బహూకరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో దీనిని స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. దీని మీద అత్యంత ఆకర్షణీయమైన నగిషీ చెక్కారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కోసం రూపొందించిన బ్రోచ్‌కు మ్యాచ్ అయ్యే విధంగా జో బైడెన్ కఫ్‌లింక్స్‌ను తయారు చేశారు.
బోరిస్‌కు
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ప్లాటినం పెయింటెడ్ కళాకృతి టీ-సెట్‌ను మోదీ బహుమతిగా ఇచ్చారు. దీనిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తయారు చేశారు. క్వీన్ ఎలిజబెత్ ప్లాటినం జూబిలీ ఉత్సవాలను గుర్తు చేస్తూ, ఆమె గౌరవార్థం ఈ టీ-సెట్‌కు ప్లాటినం పెయింట్ వేశారు.
మేక్రాన్‌కు
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌కు క్యారియర్ బాక్స్, ఖాదీ పట్టు వస్త్రంపై చేతితో ఎంబ్రాయిడరీ చేసిన జరీ జర్దోసీ బాక్స్‌ను, ఫ్రెంచ్ జాతీయ జెండాలో ఉండే మూడు రంగులతో శాటిన్ టిష్యూను బహుమతిగా ఇచ్చారు. దీనిని లఖ్‌నవూలో తయారుచేశారు.
ఓలఫ్‌కు
జర్మన్ ఛాన్సలర్ ఓలఫ్ షోల్జ్‌కు నికెల్ కోటింగ్‌తో కూడిన కంచు బిందెలను బహూకరించారు.
ఫుమియోకు
PM Modi gifted Black Pottery pieces from Nizamabad, UP to Japan PM Fumio Kishida
— ANI (@ANI) June 28, 2022
The Pottery uses a special technique to bring out black colours- while the pottery is inside the oven, it is ensured that there is no scope for oxygen to enter the oven & heat level remains high pic.twitter.com/CWy1DrITWK
జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదకు మట్టితో తయారు చేసిన పాత్రలను బహూకరించారు. వీటిని నల్ల మట్టితో తయారు చేశారు. నల్ల రంగును ప్రకాశవంతంగా తీర్చిదిద్దారు.
ట్రుడోకు
PM Modi gifted an Indian hand knitted silk carpet from Kashmir to Canada PM Justin Trudeau
— ANI (@ANI) June 28, 2022
The hand knitted silk carpets are famous all over the world for their softness. A Kashmiri Silk carpet is known for its beauty, perfectness, lushness, luxury & dedicated craftsmanship pic.twitter.com/OImLYYG6p6
కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు కశ్మీరులో తయారైన పట్టు తివాచీని బహూకరించారు. ఇది చేతితో అల్లిన తివాచీ.
మారియోకు
ఇటలీ ప్రధాని మంత్రి మారియో డ్రఘికి మార్బుల్ ఇన్‌లే టేబుల్ టాప్‌ను బహూకరించారు.
రమఫోసాకు
PM Modi gifted Dokra Art with Ramayana Theme from Chattisgarh to South Africa’s President Cyril Ramaphosa
— ANI (@ANI) June 28, 2022
Dokra Art is non–ferrous metal casting art using the lost-wax casting technique. This sort of metal casting has been used in India for over 4,000 years and is still used pic.twitter.com/g3kc1TzrxH
దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమఫోసాకు డోక్రా ఆర్ట్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిని రామాయణం ఇతివృత్తంతో ఛత్తీస్‌గఢ్‌లో తయారు చేశారు.
Also Read: Heat Wave In Tokyo: జపాన్‌లో భానుడి బ్యాటింగ్- 150 ఏళ్ల రికార్డ్ బద్దలు!