Pizza Fight Video : సాటి అమ్మాయనే కనికరం కూడా లేదు - పొట్టు పొట్టు కొట్టారు ! ఎందుకో తెలిస్తే
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయిని కొంత మంది మహిళలు చుట్టుముట్టి పొట్టుపొట్టు కొట్టారు. ఎందుకంటే ?
![Pizza Fight Video : సాటి అమ్మాయనే కనికరం కూడా లేదు - పొట్టు పొట్టు కొట్టారు ! ఎందుకో తెలిస్తే Female employee of Domino's Pizza beaten up by group of women Watch Pizza Fight Video : సాటి అమ్మాయనే కనికరం కూడా లేదు - పొట్టు పొట్టు కొట్టారు ! ఎందుకో తెలిస్తే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/03b7da103fdd5af9d893a75e7838132d_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pizza Fight : పిజ్జాలు డెలివరీ చేసే బాయ్స్ మన చుట్టూ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు. చాలా రాష్ట్రాల్లో మహిళలు కూడా ఈ పిజ్జాలు డెలివరీ చేసి ఉపాధి పొందుతూ ఉంటారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కూడా పిజ్జా డెలివరీ గర్ల్స్ ఉంటారు. అయితే ఇలాంటి ఓ డెలివరీ గర్ల్‌ను నలుగురు పట్టుకుని బాదేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అలా ఇలా కొట్టడం కాదు.. డెలివరీ గర్ల్ ఏడుస్తున్నా బట్టలు లాగేసి.. జుట్టు పట్టుకుని మరీ కొట్టారు.
A young woman was mercilessly thrashed, grabbed by the hair in full public view by a group of women in Indore. The video of the incident shows four women beating up the victim, a pizza chain employee, using sticks and fists, for allegedly staring at them @ndtv @ndtvindia pic.twitter.com/R6l2epYLpJ
— Anurag Dwary (@Anurag_Dwary) June 13, 2022
చుట్టూ చాలా మంది ఉన్నా ఒక్కరూ ఆపడానికి ప్రయత్నించలేదు. చివరికి ఆ నలుగుర్ని విడిపించుకుని ఆమె ఎలాగోలా తప్పించుకుంది. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయక తప్పలేదు. మొదట ఫిర్యాదు చేయడానికి భయపడింది. కానీ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను కొట్టిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.
అసలు గొడవేమిటి అని ఆరా తీసిన పోలీసులకు అటు బాధితురాలు చెప్పింది.. ఇటు నిందితులు చెప్పింది విని మైండ్ బ్లాంక్ అయింది. దానికి కూడా కొట్టుకుంటారా.. అన్న డౌట్ పోలీసులుక వస్తుంది మరి. పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయికి అడ్రస్ తెలియలేదో.. లేకపోతే వారే పిజ్జా ఆర్డర్ ఇచ్చి ఎదురు చూస్తున్నారేమో అనుకుని వారి వైపు చూస్తూ వెళ్లింది. తమ వైపు అలా చూస్తావా అని ఆ నలుగురు మహిళలకు కోపం వచ్చింది. తమవైపు తేడాగా చూసిందని వారు పొరపడ్డారు. సీరియస్‌గా తీసుకున్నారు.
అంతే ఒక్క ఉదుటున వెళ్లి ఆ పిజ్జా డెలివరీ గర్ల్‌ను పట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా బాదేశారు. అటు డెలివరి గర్ల్ చెప్పింది.. ఇటు నిందితులు కూడా చెప్పింది దాదాపుగా ఒకటే ఉండటంతే ఇతర కారణాలు ఏవీ లేవుకుంటున్నారు పోలీసులు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)