News
News
వీడియోలు ఆటలు
X

Power Cut Season : వర్షాలు పడినా విద్యుత్ కోతలు తప్పవా ? ఆ సంక్షోభం ముంచుకొచ్చేస్తోందా ?

బొగ్గు కొరత వల్ల వచ్చే రెండు నెలల్లో దేశంలో మరోసారి కరెంట్ సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాల కారణంగా ఈ సారి సమస్య తలెత్తవచ్చంటున్నారు.

FOLLOW US: 
Share:

Power Cut Season : దేశవ్యాప్తంగా గత రెండు నెలల కాలంలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని ఎవరూ మర్చిపోరు. ఇప్పుడు వాతావరణం కాస్త చల్లబడుతోంది కాబట్టి డిమాండ్ తగ్గి సాధారణ స్థితి వస్తోంది కానీ ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ ( CREA ) రూపొందించిన తాజా నివేదికలో ఇదే విషయాన్ని వెల్లడించారు.  జూలై- ఆగస్టు నెలల్లో దేశంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. 

ఢిల్లీ ఆరోగ్య మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ - హవాలా కేసులో ఇరుక్కున్న కేజ్రీవాల్ మంత్రి !

ముందుచూపుతో బొగ్గును నిల్వ చేసుకోకపోవడమే దీనికి కారణమని సీఆర్ఈఏ చెబుతోంది.  నివేదిక ప్రకారం... రుతుపవనాల కారణంగా బొగ్గు తవ్వకాల విషయంలో అవాంతరాలు ఏర్పడవచ్చు. వర్షాలు, వరదలు వస్తే రవాణా, పంపిణీలో కూడా సమస్యలు తలెత్తుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని... రుతుపవనాలు ప్రారంభం కావడానికి ముందే అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలను పవర్‌ ప్లాంట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. 

బీజేపీకి షాక్ ఇచ్చిన నితీష్ - ఆ కేంద్రమంత్రి రాజీనామా తప్పదు !
   
దేశంలో ఏమాత్రం విద్యుత్తు వినియోగం పెరిగినా థర్మల్‌ కేంద్రాలు భరించే స్థితిలో లేవు అని సీఆర్‌ఈఏ తన నివేదికలో పేర్కొన్నది. దేశంలో బొగ్గు ఉత్పత్తికి లోటు లేదని కానీ థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గును చేరవేయడంపై సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇటీవల విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నది. ఆగస్టులో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ 214 గిగావాట్లకు చేరవచ్చని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ( CEA ) అంచనా వేస్తున్నది. 

బెంగళూరులో రాకేష్ టికాయత్ పై దాడి - మొహంపై సిరా చల్లిన ఆందోళనకారులు !

ఇటీవల విద్యుత్ సంక్షోభం కారణంగా దేశం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని రాష్ట్రాలు మినహా పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ విద్యుత్ కోతలు అమలు చేయక తప్పలేదు. బొగ్గు కొరత ఎక్కువగా ఉండటంతో కేంద్రం కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని సూచించింది. అయితే ధర మరీ ఎక్కువ కావడంతో ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు చేలకపోతున్నాయి. దేశంలో బొగ్గు రవాణా కూడా సమస్యగా మారింది. వర్షా కాలంలోనూ కరెంట్ కష్టాలు వస్తే.. ఆర్థిక వ్యవస్థకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. 

Published at : 30 May 2022 08:24 PM (IST) Tags: Current cuts coal problem once again current crisis

సంబంధిత కథనాలు

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Mukhtar Ansari Life Imprisonment: అవదేష్ రాయ్ హత్య కేసులో బీఎస్పీ నేత ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు, జరిమానా 

Mukhtar Ansari Life Imprisonment: అవదేష్ రాయ్ హత్య కేసులో బీఎస్పీ నేత ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు, జరిమానా 

Odisha Train Accident: రైలు ప్రమాదానికి మతం రంగు పులిమితే కఠిన చర్యలు, ఒడిశా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్

Odisha Train Accident: రైలు ప్రమాదానికి మతం రంగు పులిమితే కఠిన చర్యలు, ఒడిశా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్

టాప్ స్టోరీస్

Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!

MacBook Air: ఇంటెల్ ల్యాప్‌టాప్‌ల కంటే 12 రెట్లు వేగంగా - కొత్త మ్యాక్‌బుక్ లాంచ్ చేసిన యాపిల్!

MacBook Air: ఇంటెల్ ల్యాప్‌టాప్‌ల కంటే 12 రెట్లు వేగంగా - కొత్త మ్యాక్‌బుక్ లాంచ్ చేసిన యాపిల్!