![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BJP Vs JDU : బీజేపీకి షాక్ ఇచ్చిన నితీష్ - ఆ కేంద్రమంత్రి రాజీనామా తప్పదు !
కేంద్రమంత్రికి మళ్లీ రాజ్యసభ సీటు నిరాకరించిన జేడీయూ నేత నితీష్ కుమార్ .. ఓ సాధారణ కార్యకర్తను పెద్దల సభకు ఎంపిక చేసిన అంశం హాట్ టాపిక్ గా మారింది.
![BJP Vs JDU : బీజేపీకి షాక్ ఇచ్చిన నితీష్ - ఆ కేంద్రమంత్రి రాజీనామా తప్పదు ! Nitish Kumar's Big Message For Ally BJP With Rajya Sabha Snub BJP Vs JDU : బీజేపీకి షాక్ ఇచ్చిన నితీష్ - ఆ కేంద్రమంత్రి రాజీనామా తప్పదు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/24/6ee248dd987096cb6ec268a1db6ef478_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BJP Vs JDU : తమ పార్టీ కేంద్రమంత్రికి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు జేడీయూ నేత , బీహార్ సీఎం నితీష్ కుమార్ ( Nitish Kumar ) నిరాకరించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ను మూడోసారి రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని నితీష్‌కుమార్ తిరస్కరించారు. కేంద్ర కేబినెట్‌లో తమ పార్టీ నుండి సభ్యులెవరూ లేరని బీజేపీకి సమాధానమిచ్చారు. ఆర్‌పీసీ సింగ్ జేడీయూ తరపున రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం జూన్‌తో ముగియనుంది. మూడోసారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించడంతో ఆర్‌సిపి సింగ్ రాజీనామా చేయాల్సి ఉంది.
కేంద్రమంత్రికి దక్కని రాజ్యసభ సీటు
ఈ అంశంపై ఢిల్లీలో ప్రధానితో ( PM MOdi ) సమావేశం కానున్నానని కేంద్రమంత్రిప్రకటించింది. రాజ్యసభ అభ్యర్థిని తిరస్కరించడం ద్వారా బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అధికార మిత్రపక్షం బిజెపికి ( BJP ) ఝలక్ ఇచ్చినట్లయిందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. దీంతో బిజెపి తీరు పట్ల విసిగిపోయినట్లు నితీష్‌కుమార్ సంకేతమిచ్చారు. జెడియు పార్టీకి చెందిన ఆర్ సిపి సింగ్ ప్రధాని కేబినెట్‌లో ఒకే ఒక్కడుగా ఉన్నారు. ఆర్సీపీ సింగ్ ( RCP Singh ) నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు.
నితీష్‌కు ఆప్తుడైనా బీజేపీకి దగ్గరైన ఫలితం !
ఇటీవలి కాలంలో ఆయన నితీష్ కుమార్ ను లెక్కలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్నారు. కుల ఆధారిత జన గణన విషయంలో పార్టీతో ఆయన విభేదించారు. బీజేపీ వ్యతిరేకిస్తున్నా నితీష్ కుమార్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని సింగ్ వ్యతిరేకించారు బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో కేంద్రమంత్రిని నితీష్ ( CM Nitish ) పట్టించుకోవడం మానేశఆరు. ఇటీవల ఒక వివాహ వేడుకలో ఎదురైన్పటికీ పలకరించలేదు. ఈ అంశం అప్పుడే హాట్ టాపిక్ అయింది.
బీజేపీకి నితీష్ హెచ్చరికలు పంపించారా ?
2020 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి నితీశ్ అధికారంలోకి వచ్చినా.. మిత్రపక్షం బీజేపీకి ఎక్కువ సీట్లు దక్కాయి. దీంతో నితీశ్‌పై ఆ పార్టీ పెత్తనం చెలాయిస్తుందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగా పలుమార్లు నితీష్ కుమార్ అసహనానికి గురవుతున్నారు. బీజేపీ కూడా కేంద్రమంత్రికే ( Central Minister ) రాజ్యసభ సీటు ఇవ్వాలని ఒత్తిడి చేసింది. అయితే నితీష్ మాత్రం అంగీకరించలేదు. ఓ సాధారణ పార్టీ కార్యకర్తను రాజ్యసభకు పంపించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)