అన్వేషించండి

5 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఖరారు చేసిన ఈసీ! తెలంగాణలో ఒకే విడతలో!

5 States Elections: 5 రాష్ట్రాల్లోని ఎన్నికల తేదీలను ఈసీ త్వరలోనే ఖరారు చేయనుంది.

5 States Elections: 

5 రాష్ట్రాల్లో ఎన్నికలు 

త్వరలోనే జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఖరారు చేయనుంది. అక్టోబర్ 8, అక్టోబర్ 10వ తేదీల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరంలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకూ ఆయా రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 2018లో కూడా ఇలాగే నిర్వహించింది ఈసీ. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం 2018లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. ఈ సారి కూడా ఇదే విధంగా నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఒకదానితో ఒకటి క్లాష్ అవ్వకుండా చూసుకుంటోంది ఈసీ. ఈ ఏడాది డిసెంబర్‌ 17తో మిజోరం అసెంబ్లీ గడువు ముగిసిపోనుంది. బీజేపీ మిత్రపక్షమైన మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) ప్రస్తుతం అధికారంలో ఉంది.

ఇక మిగతా నాలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీల గడువు వచ్చే ఏడాది జనవరిలో ముగియనుంది. ప్రస్తుతం తెలంగాణలో BRS అధికారంలో ఉండగా..మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల కసరత్తుని ఇప్పటికే మొదలు పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటీవలే తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించింది. ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తున్నారు ఈసీ అధికారులు. ఈ మేరకు ప్రత్యేకంగా భేటీ కూడా అవుతున్నారు. డిసెంబర్ 10-15 తేదీల్లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే...ఈ తేదీలకు సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్‌ ఇంకా అప్రూవల్ చేయాల్సి ఉంది. ఆ తరవాతే అధికారికంగా ప్రకటిస్తారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget