అన్వేషించండి

Assembly Polls: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ప్రచారానికి తెర, ఎల్లుండి పోలింగ్

Assembly Polls: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో 17న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

Assembly Polls: దేశవ్యాప్తంగా ఈ నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. విడతల వారీగా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నవంబర్ 17వ తేదీన మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు జరిగే 48 గంటల ముందు ప్రచారానికి గడువు ముగుస్తుంది. దీంతో నేటితో ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికి తెరపడటంతో మైకులు మూగబోయాయి. ఎల్లుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. 

మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 2.88 కోట్ల మంది ఉండగా.. 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 22.36 లక్షల మంది యువత కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతగా 20 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. 17న మిగిలిన 70 స్థానాలకు నిర్వహిస్తున్నారు. రెండో విడతలో 958 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. వీరిలో 827 మంది పురుషులు, 130 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 1.63 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటింగ్ కోసం ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో 18,883 పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది.

ఛత్తీస్‌గఢ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 60 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో కేవలం 15 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకోగా.. జేసీసీ పార్టీ ఐదు, బీఎస్పీ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు అంచనా వేశాయి. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాల్లో గెలవగా.. బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఏడాదికే కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఈ సారి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ వచ్చే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి.  

మరో నాలుగైదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలను పార్టీలన్నీ సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి.  దీంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తోన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే వ్యూహలను సిద్దం చేసుకుంటోంది. ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసి బీజేపీయేతర పార్టీలను కలుపుకుంటోంది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకంగా మారాయి. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్ కీలకంగా తీసుకుంది. గెలుపొందేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉండగా.. రాజస్థాన్‌ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget