Ex CJI DY Chandrachud: మాజీ సీజేఐ చంద్రచూడ్ బంగ్లాను ఖాళీ చేపించండి- కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ
Supreme Court Of India | మాజీ CJI డీవై చంద్రచూడ్ పదవి విరమణ చేసిన 8 నెలల తర్వాత కూడా సీజేఐ బంగ్లాను ఖాళీ చేయలేదని గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖను సుంప్రీంకోర్టు కోరింది.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) డివై చంద్రచూడ్ పదవీ విరమణ చేసి 8 నెలల తర్వాత కూడా కృష్ణ మీనన్ మార్గ్ లోని బంగ్లా నంబర్ 5లో నివాసం ఉంటున్నారు. అయితే మాజీ సీజేఐ చంద్రచూడ్ వెంటనే ఆ బంగ్లా ఖాళీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు అడ్మినిష్ట్రేషన్.. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA)కి లేఖ రాసింది.
నవంబర్ 2022 నుంచి నవంబర్ 2024 వరకు 50వ CJIగా జస్టిస్ చంద్రచూడ్ సేవలు అందించారు. పదవీ విరమణ చేసి నెలలు గడుస్తున్నా కూడా ఆ బంగ్లాలోనే ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన తర్వాత వచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రస్తుత సీజేఐ భూషణ్ ఆర్ గవాయి ఆ బంగ్లాలోకి మారడానికి నిరాకరించారు. గతంలో తమకు కేటాయించిన నివాసాలలోనే ఉండాలని వారు నిర్ణయించుకున్నారు.
మే 31న ముగిసిన గడువు
జూలై 1 లేఖలో జస్టిస్ చంద్రచూడ్ కు ఇచ్చిన పొడిగించిన అనుమతి మే 31, 2025న ముగిసింది. దాంతో 2022 నిబంధనల నియమం 3B ప్రకారం ఆరు నెలల గ్రేస్ పీరియడ్ కూడా మే 10న ముగిసిందని లేఖలో కేంద్రానకి సుప్రీంకోర్టు అధికారులు తెలిపారు. ఈ నివాసం, టైప్ VIII బంగ్లా, అధికారికంగా సిట్టింగ్ CJI కోసం కేటాయిస్తుంటారు.
మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సైతం బంగ్లా ఖాళీ చేయడంలో తన ఆలస్యాన్ని అంగీకరించారు. అందుకు వ్యక్తిగత కారణాలు ఉన్నాయని తెలిపారు. వీటిని సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ కు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తనకు అద్దె నివాసం కేటాయించిందని, కానీ మారడానికి ముందు అవసరమైన మరమ్మతులు, డెవలప్ మెంట్ పనుల పూర్తి కోసం ఎదురు చూస్తున్నానని చంద్రచూడ్ స్పష్టం చేశారు. తుగ్లక్ రోడ్డులోని బంగ్లా నంబర్ 14 కేటాయించారని తెలిసిందే.
అధికారంలో (హోదాలో) ఉన్న పదవితో సంబంధం లేకుండా, సమానమైన ప్రభుత్వ వనరుల కేటాయింపు కుదరదని బలోపేతం చేస్తూ, అత్యున్నత స్థాయిలో సైతం గృహ నిబంధనలను అమలు చేయడానికి కేంద్రానికి సమాచారం ఇచ్చారు.






















