(Source: ECI/ABP News/ABP Majha)
Delhi High Court: భర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న భార్యలు- దిల్లీ హైకోర్టు సీరియస్!
Delhi High Court: గృహ హింస చట్టం కింద తప్పుడు కేసులు పెడుతోన్న ఘటనలపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Delhi High Court: గృహ హింస చట్టం దుర్వినియోగంపై దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తలపై గృహ హింస చట్టం కింద భార్యలు, వారి బంధువులు తప్పుడు కేసులు పెడుతున్న ఘటనలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
కేసులో భాగంగా
ఓ మహిళ పెట్టిన కేసును విచారిస్తున్న సందర్భంగా దిల్లీ హైకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ జస్మీత్ సింగ్, జస్టిస్ అనూప్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించిన ఈ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
ఓ మహిళ తన భర్త కుటుంబం నుంచి డబ్బులు లాగేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్లాన్ వేసింది. ఆమె కనిపించకుండా దాక్కుని, తమ కూతురు కనిపించట్లేదని తల్లిదండ్రులతో నాటకామాడించింది. కూతురు భర్త, ఆయన కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఈ ఆరోపణలతో అల్లుడి నుంచి డబ్బులు లాగేందుకు యత్నించారు.
కనిపెట్టిన కోర్టు
ఈ అసత్య ఆరోపణలతో విసిగిపోయిన భర్త తాము తప్పు చేయలేదని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలో సదరు మహిళ ఆత్మహత్య చేసుకుందని వారి కుటుంబసభ్యులు నాటకమాడినట్టు తేలింది. ఈ నేరానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Uttar Pradesh: వర్షాలు కురవాలని ఎమ్మెల్యేకు బురద స్నానం చేయించిన ప్రజలు!
Also Read: Covid Update: దేశంలో ఒక్కరోజులో 20 వేల కేసులు- 145 రోజుల తర్వాత తొలిసారి