Covid Tally: దేశంలో పెరుగుతోన్న కరోనా ఉద్ధృతి- కొత్తగా 2451 కేసులు
దేశంలో కొత్తగా 2451 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కొత్తగా 2,451 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 14,241కి చేరింది. నిన్నటి పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది.
India reports 2,451 new COVID19 cases today; Active caseload at 14,241 pic.twitter.com/ikQuotdiCT
— ANI (@ANI) April 22, 2022
మరణాల సంఖ్య 5,22,116కు పెరిగింది. కొత్తగా 54 మంది మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 30 లక్షల 52 వేలు దాటింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.5 శాతానికి పైగా ఉంది.
- యాక్టివ్ కేసులు: 14,241
- మొత్తం మరణాలు: 5,22,116
- మొత్తం కేసులు: 4,30,52,481
- రికవరీలు: 4,25,16,068
వ్యాక్సినేషన్
దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. కొత్తగా 18,03,558 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,26,26,515కు చేరింది.
కీలక నిర్ణయం
కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5-12 లోపు పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి గురువారం నిపుణుల కమిటీ ఈ ప్రకటన చేసింది. 5-12 ఏళ్ల వయసు పిల్లల కోసం రెండు వ్యాక్సిన్‌లను వేసేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చిన్న పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా కార్బివ్యాక్స్‌తో పాటు కొవాగ్జిన్‌కు కూడా అనుమతి ఇస్తున్నట్లు నిపుణుల కమిటీ తెలిపింది. దీంతో త్వరలోనే 5-12 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీసుకోగా, కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేసింది. భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపింది. అయితే, కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో పలు కరోనా వేవ్ లను అడ్డుకోగలిగింది భారత్. అయితే, కొవిడ్ నియంత్రణ చర్యల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కీలక పాత్ర పోషించింది.