By: ABP Desam | Updated at : 02 Mar 2022 10:49 AM (IST)
భారత్‌లో కరోనా కేసులు (File Photo)
India Corona Cases: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా మేరకు తగ్గింది. కొన్ని రోజుల కిందటి వరకు పది వేల కరోనా కేసులు నమోదయ్యేవి. తాజావా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 7,554 (7 వేల 5 వందల 54) మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతానికి దిగొచ్చింది. దేశంలో యాక్టివ్ కేసులు లక్ష దిగువకు రావడం విశేషం. ప్రస్తుతం 85,680 (85 వేల 6 వందల 80) మంది కరోనాకు చికిత్స (Active Corona Cases In India) తీసుకుంటున్నారు.
తాజాగా 223 కరోనా మరణాలు
మరో 223 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. తాజా మరణాలతో కలిపితే దేశంలో మొత్తం (Covid Deaths In India) కరోనా మరణాల సంఖ్య 5,14,246 (5 లక్షల 14 వేల 246) కు చేరుకుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. నిన్న ఒక్కరోజులో దేశ వ్యాప్తంగా 1,41,123 (1 లక్షా 41 వేల 123) మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 98.60 శాతానికి చేరుకోవడం ప్లస్ పాయింట్. కరోనా మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు కేవలం 0.20 శాతం ఉంది.
Koo App
177.7 కోట్ల డోసుల వ్యాక్సిన్..
గత ఏడాది జనవరి (2021)లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభించినప్పటి నుంచి బుధవారం ఉదయం వరకు దేశంలో 177 కోట్ల 79 లక్షల 92 వేల 977 డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు. మంగళవారం ఒక్కరోజే 8 లక్షల 55 వేల 862 డోసుల కొవిడ్ టీకాలు ఇచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం టీకాల పంపిణీని వేగవంతం చేసింది. కేంద్రం పంపించిన టీకా డోసులలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా నిల్వలు ఉన్నాయి.
Also Read: Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి- భారత విదేశాంగ శాఖ ప్రకటన
Also Read: Vitamin Deficiency: ఆ విటమిన్ లోపిస్తే డిప్రెషన్, మతిమరుపు, లోపించకుండా ఏం తినాలంటే
Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే
Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్మెంట్లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్
IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి