Constitution Day 2023: న్యాయ దినోత్సవం రాజ్యాంగ దినోత్సవంగా ఎలా, ఎందుకు మారింది?
Constitution Day 2023 Telugu: రాజ్యాంగ దినోత్సవం జరుపుకోడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి.
Constitution Day 2023 Telugu News:
రాజ్యాంగ దినోత్సవం..
నవంబర్ 26. భారత దేశ రాజ్యాంగాన్ని ఆమోదించిన కీలకమైన రోజు. అందుకే ఈ తేదీనే ఏటా రాజ్యాంగ దినోత్సవంగా (Constitution Day 2023) జరుపుకుంటున్నారు. దీన్నే న్యాయ దినోత్సవంగానూ (Law Day 2023) పిలుచుకుంటారు. సంవిధాన్ దివస్‌గానూ (Samvidhan Divas) పిలుస్తారు. ఈ ఏడాది రాజ్యాంగ సృష్టికర్త అంబేడ్కర్ 132వ జయంతి వేడుకలు జరగడమూ రాజ్యాంగ దినోత్సవానికి మరింత ప్రాధాన్యత చేకూర్చింది. రాజ్యాంగానికి సంబంధించిన డ్రాఫ్టింగ్ కమిటీకి (Constitution Drafting Committe) ఛైర్మన్‌గా కీలక పాత్ర పోషించారు అంబేడ్కర్. గతంలో ఈ రోజుని న్యాయ దినోత్సవంగా జరుపుకునే వాళ్లు. అయితే 2015లో కేంద్ర ప్రభుత్వం Law Dayని Constitution Day గా మార్చుతూ గెజిట్ విడుదల చేసింది.
రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యత..
1949లో నవంబర్ 26వ తేదీన Constituent Assembly భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపింది. 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. ఆ రోజునే రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. 2015లో అంబేడ్కర్ 125వ జయంతిని పునస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నవంబర్ 26ని న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యంగా దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. Dr. B.R. Ambedkar కి ఇదే అసలు సిసలు నివాళి అని వెల్లడించారు. ఇదే సమయంలో రాజ్యాంగ విలువల్ని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనూ రాజ్యాంగ దినోత్సవాన్ని జరపనున్నట్టు అప్పట్లో కేంద్ర ప్రకటించింది.
రాజ్యాంగంపై ప్రసంగించాలంటే..
1. రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు..? ఎప్పటి నుంచి అది అమల్లోకి వచ్చింది అనే అంశంపై ప్రసంగించొచ్చు.
2. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎందురు రాజ్యాంగ దినోత్సవంగా మార్చింది..? దీని వెనక ఉన్న ఉద్దేశం,లక్ష్యం ఏంటి అనే అంశాలపై స్పీచ్ ఇవ్వచ్చు.
3. రాజ్యాంగంలోని సెక్షన్‌లు, అధికరణలు, షెడ్యూల్స్ గురించి ప్రస్తావించడంతో పాటు మొత్తం రాజ్యాంగంలో ఎన్ని పదాలుంటాయన్నది కూడా ఆసక్తికరమే.
4. బీఆర్ అంబేడ్కర్ సూక్తులపై ప్రత్యేకంగా స్పీచ్ ఇవ్వచ్చు.
అంబేడ్కర్ కోట్స్..(Ambedkar Quotes)
1. ఓ వర్గం అభివృద్ధి చెందిందనడానికి ఆ వర్గంలోని మహిళలు ఎంత అభివృద్ధి చెందారనేదే కొలమానం. వాళ్లు పురోగతి సాధిస్తేనే ఏదైనా సాధించవచ్చు.
2. న్యాయ వ్యవస్థ ఓ శరీరం అనుకుంటే...శాంతి భద్రతలు ఔషధాలు. ఎప్పుడైనా న్యాయ వ్యవస్థకి ఇబ్బంది వస్తే వెంటే శాంతి భద్రత మందు ఇచ్చి కాపాడాల్సి ఉంటుంది.
3. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓ ప్రభుత్వ స్వరూపమే కాదు. అందరూ కలిసి జీవించడానికి ఉద్దేశించిన ఓ విధానం. పరస్పరం అందరూ గౌరవించుకుని బతకడానికి ఏర్పాటు చేసిన ఓ వ్యవస్థ.
4. మన ఆలోచనలకు స్వేఛ్ఛ లభించడమే అసలైన స్వాతంత్య్రం. ఓ వ్యక్తి మానసికంగా స్వేచ్ఛగా లేడంటే బానిసగానే ఉన్నాడని అర్థం. ఖైదీతో సమానం. అలాంటి వ్యక్తి బతికున్నా చనిపోయినట్టే లెక్క. ఓ వ్యక్తి బతికి ఉన్నాడు అనడానికి స్వేచ్ఛే సాక్ష్యం.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply