YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
MP Avinash Reddy Arrest: వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో జరుగుతున్న నీటి సంఘాల ఎన్నికలు ఉద్రిక్తత పరిస్థితులకు కారణమయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. నీటి సంఘాల ఎన్నికల కారణంగా వేముల తాశీల్డార్ కార్యాలయం వద్ద ఘర్షణ జరిగింది.
నీటిసంఘాల ఎన్నికల్లో భాగంగా వేముల, పులివెందుల, తొండూరు మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా కార్యాలయాలకు వస్తున్నారు. ఈ క్రమంలో నీటి బిల్లులు పెండింగ్ ఉన్న వారికి నోడ్యూస్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు. అదే టైంలో బకాయిలు కట్టించుకోవడానికి కూడా అధికారులు ముందుకు రావడం లేదని నాయకులు ఆరోపిస్తున్నారు.
వేముల కార్యాలయంలో అధికారుల తీరుకు నిరసనగా నేతలు ధర్నా చేశారు. విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి వారికి మద్దతు తెలపబోయారు. ముందే అవినాష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అయినా తాను వెళ్తానంటూ అవినాష్ పట్టుబట్టడంతో అరెస్టు చేసి స్టేషన్‌కు తరిలించారు.
ఒకే టైంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చారు. ఇది ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతు కారణమైంది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకున్నారు. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కొన్ని చోట్ల ఇది పరిస్థితిని మరింతగా దిగజార్చింది.
Also Read: రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?